సోదరుడి పెళ్లిలో రష్మి రచ్చరంబోల

0

జబర్దస్త్ యాంకర్ రష్మి రెగ్యులర్ గా ఏదో ఒక వేడుకలో లేదంటే ఓపెనింగ్స్ లోనే కనిపిస్తూనే ఉంటుంది. కాని అవన్నీ కూడా ప్రొఫెషనల్. రష్మి మొదటి సారి ఒక ఫ్యామిలీ కార్యక్రమంలో అది కూడా తన సోదరుడి పెళ్లి వేడుకలో పాల్గొంది. సాదారణంగా ఏ వేడుకలో అయినా రెచ్చి పోయి మరీ పర్ఫార్మెన్స్ చేసే రష్మి తన సోదరుడి వేడుకలో రచ్చ రంబోలా అన్నట్లుగా ఎంజాయ్ చేసింది. పెళ్లి వేడుకల ఆరంభం నుండి ముగింపు భారత్ వరకు కూడా రచ్చ రచ్చగా డాన్స్ లు చేసింది.

పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చిన రష్మి తన స్టైలిష్ సాంప్రదాయ లుక్ ను పోస్ట్ చేసింది. లంగా ఓణీలో సాంప్రదాయంగా మరియు స్టైలిష్ గా ఉన్న రష్మిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడి పిక్స్ కు తెగ లైక్స్ మరియు షేర్స్ వచ్చాయి. వైజాగ్ లో జరిగిన ఈ పెళ్లి వేడుక కోసం వారం రోజుల పాటు తన పనులన్నింటిని కూడా రష్మి పక్కకు పెట్టిందట. పెళ్లి హడావుడి పూర్తి అవ్వడంతో మరో ఒకటి రెండు రోజుల్లో రష్మి మళ్లీ తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అవ్వబోతుంది.

వైజాగ్ లో రష్మి సోదరుడు మలేయ్ త్రిపాఠి వివాహం ఆదివారం జరిగింది. వారి సాంప్రదాయంలో పెళ్లి జరిగింది. రష్మి కుటుంబ సభ్యులంతా కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఆడి పాడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మలేయ్ త్రిపాఠి వివాహానికి పలువురు రాజకీయ మరియు వెండితెర బుల్లి తెరకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. సోదరుడి పెళ్లి ఏమో కాని మరి నీ పెళ్లి ఎప్పుడు అంటూ రష్మిని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి వాటికి రష్మి సమాధానం ఏం చెబుతుందో చూడాలి.
Please Read Disclaimer