రాకెట్ తాప్సీని ఆపతరమా?

0

క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కించడం అన్నివేళలా బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములాగా ట్రేడ్ భావిస్తోంది. ఇప్పటివరకూ రిలీజైన ఎన్నో స్పోర్ట్స్ బయోపిక్స్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో వరుసగా ఈ తరహా కథాంశాల్ని ఎంచుకునేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాదు.. యువతరంలో స్ఫూర్తిని నింపే ఈ తరహా పాత్రల్లో నటించేందుకు స్టార్లు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ కోవలో వస్తున్నదే `రాకెట్ రష్మీ`. ఎన్నో వైవిధ్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ వరుస సంచలనాలకు తెర తీస్తున్న తాప్సీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

ఇటీవలే `మిషన్ మంగళ్` లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో సైంటిస్టుగా నటించి మెప్పించింది. అలాగే లేటు వయసు షార్ప్ షూటర్ ప్రకాషి తోమర్ (చంద్రో తోమర్ సోదరి) పాత్రలోనూ తాప్సీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రియలిస్టిక్ అథ్లెట్ పాత్రలో నటిస్తూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాకెట్ రష్మీ అనేది ఈ సినిమా టైటిల్. టైటిల్ కి తగ్గట్టే అన్ స్టాపబుల్ ఫాస్ట్ రన్నర్ గా తాప్సీ నటిస్తోంది. రాజస్థాన్ కచ్ ప్రాంతానికి చెందిన గ్రామీణ యువతిగా.. జాతీయ స్థాయికి ఎదిగే రాకెట్ రన్నర్ గా తాప్సీ సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకోబోతోంది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ లో తాప్సీని చూడగానే ఒక స్టేడియంలో రన్నింగ్ ట్రాక్ పై చిరుతలా దూసుకెళుతున్న అథ్లెట్ (రన్నర్) లా కనిపిస్తోంది. రాజస్థానీ ట్రెడిషన్ ని ప్రతిబింబించే ఓ ప్రత్యేకమైన డిజైనర్ డ్రెస్ ని ధరించి.. రాజస్థానీ స్టైల్ ముకు పుడకతో తాప్సీ లుక్ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు నంద పెరియ స్వామి స్క్రిప్టును అందిస్తున్నారు. ఆర్.ఎస్.వీ.పీ తో కలిసి మ్యాంగో పీపుల్ మీడియా నెట్ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నామని దర్శకరచయితలు చెబుతున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home