కొత్త మహేష్ బాబును చూస్తారు!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ శనివారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. స్వయంగా మహేష్ బాబు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకుంటున్నారు. ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి దర్శకత్వంతో మొదలు పెట్టి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ వరకూ ఎన్నో అంశాలపై తన అభిప్రాయాలు తెలిపారు.

ఈమధ్య ఎక్కువగా సీరియస్ గా ఉండే సినిమాలు చేస్తున్నానని.. ‘శ్రీమంతుడు’.. ‘భరత్ అనే నేను’.. ‘మహర్షి’ అన్నీ సినిమాలు బలమైన కథ ఉన్నవని చెప్పారు. దీంతో వీటికి భిన్నంగా ‘దూకుడు’ తరహాలో ఒక ఎంటర్టైనర్.. ఈ ట్రెండ్ కు తగ్గట్టు చెయ్యాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. ‘మహర్షి’ షూటింగ్ సమయంలో అనిల్ రావిపూడి సరిగ్గా అలాంటి కథే చెప్పడంతో తనకు నచ్చిందన్నారు. ఆ సమయంలో అనిల్ ‘F2’ చేస్తున్నారని చెప్పారు. ఇది డిఫరెంట్ గా ఉండే కామెడీ అని.. మొదట్లో ఇలాంటి కామెడీ చెయ్యడంపై అనుమానాలు ఉన్నప్పటికీ తర్వాత ఓకే అనిపించిందని అన్నారు. ఈ సినిమాలో కొత్త మహేష్ బాబును చూస్తారని చెప్పారు. తన కెరీర్ మొత్తం మీద ‘సరిలేరు నీకెవ్వరు’ చెయ్యడం బెస్ట్ డెసిషన్ అని చెప్పుకొచ్చారు.

విజయశాంతి గారితో పని చెయ్యడం చాలా గొప్పగా అనిపించిందని.. 30 ఏళ్ళ తర్వాత ఆవిడతో నటించినా.. షూటింగ్ మొదటి రోజు తమ కాంబినేషన్ సీన్ లో నటిస్తుంటే నిన్నే నటించినట్టుగా అనిపించిందని చెప్పారు విజయశాంతి మేడమ్ తో భవిష్యత్తులో కూడా నటించాలని ఉందని చెప్పారు. హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడుతూ.. రష్మిక కొత్త తరం హీరోయిన్ అని.. ఈ సినిమాలో పాత్రకు కరెక్ట్ గా సూట్ అయిందని చెప్పారు. మొదటి రోజునుంచే టీమ్ తో చక్కగా కలిసిపోయిందని.. మంచి నటన కనబరిచిందని మెచ్చుకున్నారు.

దేవీశ్రీ పసాద్ మ్యూజిక్ గురించి బయట విమర్శలు వస్తున్నప్పటికీ మహేష్ బాబు మాత్రం దేవీని వెనకేసుకొచ్చారు. దేవీ శ్రీ ప్రసాద్ గొప్ప సంగీతదర్శకుడు అని చెప్పారు. ‘మైండ్ బ్లాక్’ సాంగ్ ను ఫ్యాన్స్ తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు.
Please Read Disclaimer