రౌడీ రాణిలా ఈ జంప్ ఏంటి రష్మిక ?

0

అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకున్న కన్నడ కస్తూరి రష్మిక మందన. ఛలో-గీత గోవిందం చిత్రాలతో టాలీవుడ్ లో టాప్ స్లాట్ లోకి దూసుకెళ్లింది. సౌత్ అంతా తన వైపు చూసేలా చేసింది. తొలి చిత్రం ‘చలో’ నుంచి రష్మిక డబ్బింగులోనూ తన సొంత గొంతునే వినిపిస్తూ మ్యాజిక్ చేయడం అభిమానుల్ని ఆకట్టుకుంది. ‘ఏమాయ చేసావే’ తరవాత సమంత ఇండస్ట్రీని మాయ చేసినట్టే ‘గీత గోవిందం’ తో రష్మిక మాయ చేసింది. రెండే రెండు సినిమాలతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయిన రష్మిక ఇప్పడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతోంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన వరుస చిత్రాల్లో నటించి రౌడీ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక ప్రస్తుతం సౌత్ లోనే బిజీయెస్ట్ హీరోయిన్. క్రేజీ హీరోలు మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ నితిన్ తో భీష్మ సినిమాలు చేస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ల కలయికలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న చిత్రంతో పాటు తమిళం- తెలుగు భాషల్లో కార్తి హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ (టైటిల్ పరిశీలనలో వుంది) వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. మరికొన్ని కథలు వింటోంది.

ఇదిలా వుంటే ఆయాచితంగా అందివచ్చిన స్టార్ డమ్ ని నిలబెట్టుకోవడం అంటే ఆషామాషీనా? ఈ విషయంలో రష్మిక చాలానే కంగారుగా ఉందట. ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే రష్మిక ఈ మధ్య ప్రత్యేక ట్రైనర్ పర్యవేక్షణలో జిమ్ లో శిక్షణ తీసుకుంటోంది. తాజాగా తన ట్రైనర్ సమక్షంలో బ్యాక్ జంప్ చేయడం నెటిజనులను.. అభిమానుల్ని అవాక్కయ్యేలా చేస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా ఇన్ స్టాలో రష్మిక షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. రౌడీ గాళ్ జిగేల్ మనిపించేలా చేసిన బ్యాక్ జంప్ పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Please Read Disclaimer