మరో సూపర్ స్టార్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించి సక్సెస్ దక్కించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రంకు రెడీ అవుతుంది. ఈ ఏడాది భీష్మ చిత్రంతో కూడా సక్సెస్ పొందిన రష్మిక ఖాతాలో మరో సూపర్ స్టార్ మూవీ పడ్డట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించబోతుందట.విజయ్ 64వ చిత్రం మాస్టర్ లోనే రష్మిక ఎంపిక అయ్యిందని ప్రచారం జరిగింది. కాని మాస్టర్ చిత్రంలో రష్మిక నటించలేదు. త్వరలో విజయ్ చేయబోతున్న 65వ చిత్రంకు మురుగదాస్ దర్శకత్వం వహించబోతున్నాడు. వీరిద్దరి కాంబోకు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాంటి చిత్రంలో ఈ అమ్మడు నటించే అవకాశం దక్కించుకుందంటూ తమిళ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.మాస్టర్ లో మాస్ అయిన ఛాన్స్ ను ఈసారి మురుగదాస్ ఈ అమ్మడికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఈమె కార్తీతో సుల్తాన్ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా తర్వాత తమిళనాట ఈమె చేయబోతున్న చిత్రం విజయ్ తోనే అనేది తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే మురుగదాస్ రష్మిక ల మద్య చర్చలు జరిగాయనేది తమిళ మీడియాలో వస్తున్న కథనాల సారాంశం.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుండి తేరుకున్న తర్వాత షూటింగ్ కు వెళ్లాలని మురుగదాస్ ఏర్పాట్లు చేస్తున్నాడు. విజయ్ 65వ చిత్రం షూటింగ్ ప్రారంభం అయితే అప్పుడు హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer