మాట తేడా వస్తే తాన తందానా రష్మికా

0

మాట్లాడే ముందు ఆచితూచి పదాలు వెతకాలి. అలా కాకుండా ఏదో ఒకటి నోరు జారితే అంతే సంగతి. అందునా సోషల్ మీడియా యుగంలో ప్రతిదానికి వెంటనే కౌంటర్ పడిపోతోంది. అపరిపక్వంగా మాట్లాడినా.. అర్థరహితంగా వ్యవహరించినా నెలిజనులు ఆటాడేస్తున్నారు. దొరికితే చాలు పేకాడేస్తున్నారు.

పాపం కుర్రబ్యూటీ రష్మిక ఇలానే ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. పైగా మహేష్ సూపర్భ్ డ్యాన్సర్..! అంటూ కితాబిచ్చి అనవసరంగా కెలుక్కుంది. నేను మహేష్ తో సరితూగలేనేమో! అంటూ బాధపడిపోవడంతో ఇక అమ్మడిని ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు నెటిజనం. ఇవిగో ఈ డ్యాన్సులతోనేనా పోటీపడలేను అంటున్నావ్! అంటూ మహేష్ డ్యాన్సుల్ని ఫ్యాన్స్ వీడియోల సాక్ష్యంగా షేర్ చేస్తుంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి రష్మికకు ఎదురైంది. మహేష్ కే ఇలా అయిపోతే ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ అల్లు అర్జున్ తో ఇంకెంత ఇదైపోతుందో అంటూ జాలి కురిపిస్తున్నారంతా.

మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న రష్మిక తదుపరి బన్ని- సుక్కూ కాంబినేషన్ మూవీకి షిఫ్ట్ కాబోతోంది. అక్కడ డ్యాన్స్ ఫ్లోర్ పై ఉంటుంది అసలైన మజా. బన్నితో డ్యాన్సులు అంటే చాలా జాగ్రత్తగా స్టెప్పులు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ రొంపిలోకి మెగా ఫ్యాన్స్ .. ఘట్టమనేని ఫ్యాన్స్ ఒకరితో ఒకరు బాహాబాహీకి దిగడంతో ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా యుద్ధం రన్ అవుతోంది. మహేష్ ని అలా అంటారా? అంటూ మెగాఫ్యాన్స్ ని సందేహించడమే గాక వారికి కౌంటర్లు వేస్తూ పవన్ కల్యాణ్ గత సినిమాల డ్యాన్సింగ్ వీడియోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Please Read Disclaimer