నేను కేవలం సోలో హీరోయిన్ పాత్రలే చేస్తా..!

0

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఛలో చిత్రంతో పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన. మొదటి సినిమాతోనే తెలుగు యూత్ అందరిని ఫిదా చేసింది. రష్మిక చిలిపితనం క్యూట్ క్యూట్ నటన కుర్రకారుకి విపరీతంగా నచ్చేసింది. ఆ క్యూట్ నెస్ తోనే.. ఛలో గీత గోవిందం సరిలేరు నీకెవ్వరూ భీష్మా లాంటి వరుస విజయాలు దక్కడంతో టాలీవుడ్ లో అమ్మడికి భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు నితిన్ తో భీష్మ సినిమాలతో భారీ విజయాలను అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రష్మిక విజయ పరంపర కొనసాగుతున్నట్లు కన్పిస్తుంది.

అయితే నాని త్వరలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఆ సినిమాకు ‘శ్యాం సింగరాయ్’ అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందట. అయితే ప్రధాన హీరోయిన్ పాత్రలో సాయిపల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ సాయిపల్లవితో సంప్రదింపులు జరిపిందట. ఇక ఆ పాత్ర కూడా సాయిపల్లవికి బాగా నచ్చిందనీ సమాచారం. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కథానాయిక పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందనీ అందుకే ఆమె ఒప్పుకుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో గతంలో కనిపించే హీరోయిన్ పాత్ర ఒకటుందట.

ఆ పాత్ర కోసం రష్మికను సంప్రదిస్తే నో చెప్పేసిందట. నాని రష్మిక కలిసి ఇదివరకే దేవదాస్ అనే సినిమాలో నటించారు. అయినా కూడా ఎందుకు నో చెప్పింది అంటే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. రష్మిక కేవలం సోలో హీరోయిన్ పాత్రలే చేయాలనీ నిర్ణయించుకుందట. అందుకే ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించిందని టాక్. ఇక ఈ శ్యామ్ సింగరాయ్ సినిమా నాటి పిరియాడిక్ కంటెంట్ తో సాగుతుందనీ ఒకప్పటి కలకత్తా నగరాన్ని తలపించే నేపథ్యంలో సాగనుందని సమాచారం. చూడాలి మరి రష్మిక స్థానంలో ఎవరినీ రీప్లేస్ చేస్తారో..!
Please Read Disclaimer