తనని కాదన్న ప్రేయసిపై పంతమేనా ఇది?

0

లైఫ్ లో ప్రతిదీ ఓ ఛాలెంజ్ లాంటిదే. ఆ ఛాలెంజ్ లో నెగ్గడమే చాలా సమస్యలకు పరిష్కారాన్నిస్తుంది. ఇప్పుడు ఆ యంగ్ హీరో లైఫ్ లో తనకు ఎదురైన సవాల్ ని అలాగే హ్యాండిల్ చేయాలనుకుంటున్నాడా అంటే అవుననే ఈ ప్రయత్నం చెబుతోంది. తనని కాదన్న ప్రేయసిని మించి కెరీర్ లో ఎదిగి చూపించాలన్న కసి కనిపిస్తోంది. మరి సవాల్ లో నెగ్గుతాడా లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.

కన్నడ హీరో రక్షిత్ శెట్టి- రష్మిక మందనల ప్రేమకథ తెలిసిందే. కలిసి నటించారు. అటుపై ప్రేమించుకున్నారు. నిశ్చితార్థం అయ్యింది. కానీ ఇంతలోనే ట్విస్టు. ఉన్నట్టుండి రష్మిక టాలీవుడ్ లో జాక్ పాట్ కొట్టింది. వరుస హిట్లతో అగ్ర కథానాయిక స్టాటస్ అందుకుంది. ఈలోగానే రక్షిత్ తో మనస్ఫర్థలు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం వగైరా సన్నివేశాలు చకచకా ముగిశాయి. ప్రస్తుతం ఆ హీరో తన దారిలో తను ఉన్నాడు. రష్మిక టాలీవుడ్ లో బిజీ నాయికగా కెరీర్ ని సాగిస్తోంది.

ఇదంతా తెలిసిన కథే కానీ.. ఇప్పుడు రక్షిత్ చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే పంతానికి పోయి తనని తాను పెద్ద స్టార్ గా ఆవిష్కరించుకునే ప్రయత్నం కనిపిస్తోంది. అందుకే అతడు నటించిన సినిమాని పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేసే ప్రయత్నం సాగుతోంది. అతడు నటించిన ఓ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు తమిళంలోనూ రిలీజ్ చేస్తున్నారు. శ్రీమన్నారాయణ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ ప్రయత్నం చూస్తుంటే రక్షిత్ బిగ్ ఛాలెంజ్ తీసుకున్నాడనే భావించాలి. అయితే రక్షిత్ ఇప్పటివరకూ కేవలం కన్నడ ప్రేక్షకులకే తెలుసు. ఇరుగు పొరుగు భాషల్లో అతడి పరిచయం లేదు. మరి ఈ ఛాలెంజ్ నెగ్గాలంటే సినిమాలో చాలా దమ్ముండాలి. కేజీఎఫ్ యశ్ లా సక్సెస్ కొడితేనే అతడు అనుకున్నది సాధించినట్టు. రష్మిక స్టార్ డమ్ ని మించిన హీరోయిజం రక్షిత్ చూపించగలడా లేదా? మరి ఏం చేస్తాడో చూడాలి.
Please Read Disclaimer