మహేష్ ని బాగా టార్చర్ పెట్టిందట

0

ఛలో – గీత గోవిందం- డియర్ కామ్రేడ్ చిత్రాలతో రష్మిక పాపులారిటీ స్కైని టచ్ చేసింది. ఇంతలోనే సూపర్ స్టార్ మహేస్ సరసన అవకాశం అందుకుంది. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో రష్మిక అల్లరి పాత్ర యూత్ కి బాగా కనెక్టయిపోయింది. మరోసారి డిఫరెంట్ మ్యానరిజమ్స్ తో రష్మిక బోయ్స్ కి కనెక్టయిపోనుందని ట్రైలర్ చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో తన కోస్టార్స్ గురించి ఇతర వ్యవహారాల గురించి రష్మిక చాలానే చెప్పింది.

నేను ఈ సినిమాలో అల్లరమ్మాయిగానే కనిపిస్తాను. మహేష్ వెంటపడుతూ బాగా అల్లరి చేసే క్యారెక్టర్.

అత్యద్భుతమైన డ్రామాతో కామికల్ గా ఉంటుంది. ఈ సినిమా తో పూర్తి కామెడీ రోల్ చేసే అవకాశం దక్కింది. ఐదో సినిమానే అయినా పూర్తిగా ప్రయోగాత్మక పాత్రలో నటించాను అని తెలిపారు.

ఇక సెట్లో కూడా ఇలానే అల్లరి చేసేవారా? అని రష్మికను ప్రశ్నిస్తే.. తనకు సీరియస్ గా ఉండడం అస్సలు ఇష్టం ఉండదని.. అల్లరి చేయడం అంటేనే ఇష్టమని తెలిపింది. అందుకని సెట్లో అందరితో జోవియల్గా ఉండేదానిని అని తెలిపింది. అంతేకాదు.. సెట్ లో మహేశ్ చాలా కామ్ గా ఉండేవారు. నేనే వెళ్ళి తనని డిస్ట్రబ్ చేసేదానిని అంటూ రష్మిక తెలిపింది. ఒక రకంగా ట్రైలర్ లో చూపించినట్టే మహేష్ ని ఆటపట్టించేదేమో!! ఐయాం ఇంప్రెస్డ్.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ లాంటి మేనరిజమ్స్ తో ఇప్పటికే రష్మిక బాగానే ఇంప్రెస్ చేసేసిందిగా.
Please Read Disclaimer