రష్మికపై మనసు పారేసుకున్నట్లున్నాడుగా..!

0

టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక హవా కొనసాగుతుంది. ఈ అమ్మడు మొన్న సంక్రాంతికి మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రంతో పాటు ఈ ఏడాది పలు చిత్రాలతో ప్రేక్షకులను ఈమె ఎంటర్ టైన్ చేయబోతుంది. త్వరలో ఈమె నితిన్ తో కలిసి భీష్మ చిత్రంతో రాబోతున్న విషయం తెల్సిందే. ఈమెతో ఒకసారి సినిమా చేసిన హీరోలు మళ్లీ మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో రెండవ సారి నటించిన విషయం తెల్సిందే. భీష్మ చిత్రంలో నితిన్ తో కలిసి నటించిన రష్మిక ఆయన మనసు దోచుకున్నట్లుగా ఉంది. అందుకే మరోసారి నటించేందుకు ఆగలేక పోతున్నానంటూ నితిన్ ట్వీట్ చేశాడు. తాజాగా భీష్మ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది.

ఈ సందర్బంగా నితిన్ సోషల్ మీడియాలో.. వెంకీ కుడుముల ఐ లవ్ యూ.. నీ గురించి మాటల్లో చెప్పలేను. భీష్మ వంటి సినిమాను నాకు ఇచ్చినందుకు థ్యాంక్యు. రష్మిక నీవు నా ఫేవరేట్. నీతో మళ్లీ సినిమా చేసేందుకు ఆగలేకుండా ఉన్నానంటూ పోస్ట్ చేశాడు. రష్మిక తో షూటింగ్ సమయంలో చాలా మంచి టైం ను స్పెండ్ చేశానంటూ కూడా నితిన్ గతంలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి రష్మికతో మళ్లీ చేసేట్లుగానే ఉన్నాడు.

Comments are closed.