కామ్రేడ్ భామకు వయసుతో పని లేదట!

0

చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేస్తుంటారు కొందరు కథానాయికలు. ఆ కోవకే చెందుతారు రష్మిక. గీతా గోవిందంతో ఆమె ఇమేజ్ ఫుల్ పీక్స్ కు వెళ్లటమే కాదు.. లక్షలాది యూత్ కు ఆమె కలల రాణిగా మారారు. తాజాగా నటించి.. విడుదలకు సిద్ధమైన చిత్రం డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండతో మరోసారి జతకట్టిన ఈ సినిమా నాలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్ ను భారీగా నిర్వహిస్తుండటంతో.. పెద్ద ఎత్తున మీడియాతో భేటీలు అవుతున్నారు. తాజాగా రష్మికను ఒక మీడియా సంస్థకు చెందిన విలేకరి ఆసక్తికర క్వశ్చన్ వేశారు. మీకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలన్నారు.

దీనికి బదులిచ్చిన రష్మిక.. తనకు కాబోయేవాడు తన భావాల్ని.. ఇష్టాల్ని వ్యక్తపరిచే వ్యక్తి అయి ఉండాలని.. ఒకవేళ లేకున్నా ఫర్లేదు కానీ నిజాయితీగా మాత్రం ఉండాలన్నారు. అతడి ప్రవర్తన తనకు నచ్చాలని.. అన్నింటికి మించి అతడిది మంచి మనసై ఉండాలన్నారు.

అతడి ప్రవర్తన తనకు నచ్చటంతోపాటు.. ఎక్కువసేపు అతడితో గడపాలనే భావన కలిగి ఉండాలని.. తన దృష్టిలో రొమాంటిక్ గా ఉండేందుకు వయసుతో పని లేదన్నారు. మిగిలిన అన్ని బాగానే ఉన్నా.. రొమాంటిక్ గా ఉండటానికి వయసుతో సంబంధం లేదన్న రష్మిక మాట ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer