సరిలేరు నీకెవ్వరు.. రష్మిక ఇప్పుడే మాట్లాడదు!

0

రష్మిక మందన్నకు హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న విషయం నిజమే కానీ తరచుగా ట్రోలింగుకు కూడా గురి అవుతూ ఉంటుంది. అప్పట్లో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న సమయంలో ఒకసారి ట్రోలింగ్ జరిగింది. ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్స్ సయయంలో ‘నాకు కన్నడ సరిగా రాదు’ అనడంతో మరోసారి ట్రోలింగ్ హీటు తగిలింది. ఇక రీసెంట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ దసరా పోస్టర్ ను ట్వీట్ చేసే సమయంలో టాగ్స్ జోడించకపోవడంతో కొందరు మహేష్ ఫ్యాన్స్ రష్మికపై మండిపడ్డారు.

కొందరైతే విజయ్ దేవరకొండ సినిమాకు ప్రమోషన్స్ విషయంలో రష్మిక చాలా యాక్టివ్ గా ఉందని.. మహేష్ సినిమా విషయంలో మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోందని విమర్శలు సంధించారు. కానీ అదేమీ నిజంకాదని ఇన్సైడ్ టాక్. రష్మిక ఇప్పటివరకూ పనిచేసింది అప్కమింగ్ హీరోలు.. మీడియం రేంజ్ స్టార్లు. మహేష్ బాబులాంటి సూపర్ స్టార్ తో పనిచేయడం ఇదే రష్మికకు తొలిసారి. సాధారణ హీరోల సినిమాలకు హీరోయిన్లు ఇలాంటి ప్రమోషన్ హంగామా చేయడం అవసరం కానీ మహేష్ సినిమాకు రష్మిక ఇప్పటినుంచే ప్రమోషన్ హంగామా చేయాల్సిన పని లేదని అంటున్నారు. ఎందుకంటే పెద్ద స్టార్ హీరోల సినిమాలకు ఒక ప్రత్యేకమైన ప్రమోషన్ స్ట్రేటజీ ఉంటుందని.. దానికి తగ్గట్టే హీరోయిన్లు నడుచుకుంటారని అంటున్నారు.

అందుకే రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలో పెద్దగా డీటెయిల్స్ పంచుకోవడం లేదని.. సినిమా రిలీజుకు ముందు ప్రమోషన్స్ సమయంలో మాత్రం మీడియా ముందుకు వస్తుందని అంటున్నారు. అయితే ఫ్యాన్స్ కు మాత్రం రష్మిక మాట్లాడకపోవడం నిరాశ కలిగిస్తోంది.