మ్యాడమ్ నుంచి లెస్సన్స్ నేర్చుకున్నా

0

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో విజయశాంతి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆన్ స్క్రీన్ తన పాత్ర ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని దర్శకుడు ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. విజయశాంతి ఎంతో నచ్చి చేస్తోన్న చిత్రం కూడా ఇదే కావడంతో.. భారతి పాత్ర సినిమా లో మహేష్ కు ధీటు గా ఉంటుందని భావిస్తున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి చెప్పిన కథే హీరో అయినప్పటికీ! అందులో పాత్రలు ఆ కథకు ప్రాణం పోసాయని చెబుతున్నారు. ఇందులో విజయశాంతి ..మహేష్ పోటాపోటీ నటన రక్తి కట్టిస్తుందట.

వీళ్లిద్దరితో పోటీపడుతూ యంగ్ హీరోయిన్ రష్మిక మందన పాత్ర అలరిస్తుందట. ఛలో – గీత గోవిందం విజయాలతో లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు ఇంతలోనే మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది. లక్కీగా ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తో కలిసి నటించింది. ఈ సందర్భంగా ఆన్ సెట్స్ లో విజయశాంతి తో నటిస్తున్నప్పుడు కలిగిన అనుభూతిని రష్మిక షేర్ చేసుకుంది. కేరళ షెడ్యూల్ లో మొదటి సారి మ్యాడమ్ ని కలిశాను. నాకు ఇంతకుముందే మేడమ్ గురించి తెలుసు. లేడీ అమితాబ్ లాంటి ఆమెతో వెంటనే కలిసి పోయి మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది.

తర్వాత సెట్ లో ఆమె ఎనర్జీ చూసి ఫిదా అయ్యాను. వరుసగా రెండు రోజులు ఆమెతోనే ఉన్నాను. డ్యాన్స్ నటనకి సంబంధించిన కొన్ని సలహాలు అడిగి తెలుసుకున్నాను. ఎన్నో పవర్ ఫుల్ పాత్రలో నటించిన అనుభవం మ్యాడమ్ ది. ఆమెతో కలిసి నటించాలంటే మొదట్లో కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యా. తర్వాత మ్యాడమ్ చనువు తీసుకోవడంతో కంపర్ట్ బుల్ గా ఫీలయ్యా. ఆమెతో కలిసి నటించడం గొప్ప ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది. ఇలా ఒకేసారి ఇద్దరి స్టార్లతో కలిసి నటించే అవకాశం రావడం లక్కీగా భావిస్తున్నాను అని తెలిపింది రష్మిక.
Please Read Disclaimer