తానెంత బిజీగా ఉంటుందో చెప్పిన రష్మిక!

0

యూత్ కి కనెక్టింగ్ మంత్రగా మారిపోయారు రష్మిక మందాడ. చేసిన సినిమాలు తక్కువే అయినా.. గీతగా అభిమానుల మదిలో నిలిచిన ఆమె.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో మరోసారి జత కట్టి.. గీతాగోవిందం మేజిక్ ను మరోసారి రిపీట్ చేయటం ఖాయమన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అందం కంటే ఆకర్షణే రష్మిక బ్యూటీ సీక్రెట్ గా చెప్పేటోళ్లు ఉన్నారు. చలాకీగా మాట్లాడే ఈ చిన్నదాని షెడ్యూల్ ఎంత బిజీ అన్నది తన మాటలతో భలేగా చెప్పేసింది.

అగ్రనటులతో సినిమాలకు వరుస పెట్టి ఓకే చేసిన ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఇక.. రెండు రోజుల్లో విడుదల కానున్న డియర్ కామ్రేడ్ తర్వాత.. అమ్మడు మరింత బిజీ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తానెంత బిజీగా ఉంటుందన్న విషయాన్ని వెల్లడించింది.

తీరిక లేని షెడ్యూల్స్ తో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తిండి.. నిద్ర కూడా సరిగా ఉండట్లేదన్నారు. ఒక్కోసారి ఉదయాన్నే సెట్ కి వెళ్తే.. పడుకునేసరికి తెల్లారిపోతోందని.. మరుసటి రోజు మళ్లీ సెట్ కి వెళ్లాల్సిందేనని.. ఒక్కోసారి తిండి కూడా తినాలన్న విషయాన్ని కూడా మర్చిపోతుందట.

ఇదంతా తాను కోరుకున్నదే కదా అని పాజిటివ్ గా ఫీల్ కావటమే కాదు.. తీరిక లేకుండా పని చేయటానికి మించిన అదృష్టం ఏముంటుందని చెబుతోంది. మూవీ మేకింగ్ వేళ ఇంత కష్టపడితే.. సినిమా విడుదలకు ముందు.. తనను ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలాంటి రిజల్ట్స్ వస్తాయన్న ఆలోచనలతో నిద్ర పట్టదని చెప్పింది. పని చేసినా.. పని చేయకున్నా ఆలోచనలతో నిద్ర మాత్రం తక్కువనే విషయాన్ని రష్మిక మాటలతో అర్థం కాక మానదు.
Please Read Disclaimer