ఆరంభం తనదే అంటోందిగా

0

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా నటించింది రష్మిక మందన్న. ఈ సినిమాతో జనవరిలో సందడి చేయనుంది. అయితే నెల గ్యాప్ లోనే మళ్ళీ ‘భీష్మ’ తో పలకరించబోతుంది. రెండు సినిమాల్లోనూ రష్మిక క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండనుంది. ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా రష్మిక మేజిక్ చూపించనుందనే విషయం ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది.

అయితే ఇదే విషయాన్ని రష్మిక దగ్గర ప్రస్తావిస్తే అవును అనుకోకుండా రెండు సినిమాలు నెల గ్యాప్ లోనే వచ్చేస్తున్నాయి. సో ఈ ఇయర్ స్టార్టింగ్ నాదే అంటూ లోలోపల ఆనందపడుతూ తెలిపింది. నిజానికి రష్మిక చెప్పింది నిజమే రెండు సినిమాలతో ఈ కన్నడ బ్యూటీ వరుస హిట్స్ కొడితే కనుక ఈ భామదే పై చేయి అవుతుంది. అందులో సందేహమే లేదు.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు భీష్మ రిజల్ట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ అమ్మడు నెక్స్ట్ అల్లు అర్జున్ తో సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తోంది. ఫిబ్రవరి నుండి ఈ సినిమా సెట్స్ లో పాల్గొనబోతుంది. ఈ సినిమా కూడా ఇదే ఏడాది థియేటర్స్ లోకి వస్తే రష్మిక మూడు సినిమాలు రిలీజయినట్టే.
Please Read Disclaimer