క్యూటీకి కుక్క బిస్కెట్లు తినే హ్యాబిట్

0

ఆన్ లొకేషన్ రష్మిక చలాకీతనంపై సాక్షాత్తూ సూపర్ స్టార్ మహేష్ కాంప్లిమెంట్ తెలిసిందే. సెట్స్ లో తనను మించిన చలాకీతనంతో ఆకట్టుకునేదని….సెటైర్లు వేయడంలో.. పంచ్ లు విసరడంలో నన్నే మించిపోయిందంటే నమ్మండి! అంటూ మహేష్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ మహేష్ ఏ హీరోయిన్ విషయంలోనూ ఇంత చలాకీ కాంప్లిమెంట్ ఇవ్వలేదు. ఎంతో రిజర్వ్ డ్ గా కనిపించే మహేష్ నే కదిలించిందంటే రష్మిక ఎంత ఘనాపాటినో చెప్పాల్సిన పనిలేదు. రష్మికలో అప్పటివరకూ బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. మహేష్ పుణ్యమా అని రష్మిక ఎగ్రెసివ్ క్వాలిటీస్ తో పాటు.. ఎంటర్ టైన్ మెంట్ కోణం బయటపడింది.

ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ సరసన `భీష్మ` చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆ ఇద్దరూ ఇంటర్వూల పేరుతో మీడియాని చుట్టేస్తున్నారు. ఎన్నో విశేషాలను మీడియాతో పంచుకుంటున్నారు. సినిమా విశేషాలతో పాటు…వ్యక్తిగత అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఓ ఇంటర్వూలో రష్మిక గురించి చెప్పండని నితిన్ ని యాంకర్ అడిగారు. ఎవరైనా ఆకలేస్తే పండ్లతో పాటు.. మనుషులు తినే బిస్కెట్లు.. టిఫిన్ తింటారు. కానీ రష్మిక ఏం తింటుందో తెలుసా? అని నితిన్ చెబుతుండగా రష్మిక మధ్యలో ఎంటరై నితిన్ నోరు నొక్కేసే ప్రయత్నం చేసింది. ఆ సీక్రెట్ చెప్పొద్దంటూ నితిన్ ని ఎంతగానో బతిమలాడుకుంది.

అయినా నితిన్ క్షమించలేదు.. ఏమాత్రం ఊరుకోలేదు. “రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంద“న్న టాప్ సీక్రెట్ ని బయట పెట్టేశాడు. దీంతో కుక్క బిస్కెట్లా? అంటూ యాంకర్ ఆశ్చర్యంగా రష్మిక వైపు చూసి కిల కిలా నవ్వేసారు. ఆ సమయంలో నితిన్ ని కంట్రోల్ చేయకపోయి ఉంటే రష్మిక వ్యక్తిగత విషయాలు ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వచ్చేవేమో. అయినా ఓ హీరోయిన్ అయి ఉండి కుక్క బిస్కెట్లు తినడం ఏమిటి? మనుషులు తినే బిస్కెట్లు లేక అలా చేసిందా? లేక కుక్క బిస్కెట్లే రుచిగా ఉన్నాయా? అంటూ నెటిజనులు ఫన్నీ కామెంట్లు పెడుతూ ఆట పట్టిస్తున్నారు.
Please Read Disclaimer