కమాన్ పోస్ట్ చెయ్ రష్మిక.. రెచ్చగొడుతున్న డైరెక్టర్!

0

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న క్రేజీ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో క్రేజ్ మాత్రం పీక్స్ లో ఉంది. ప్రస్తుతం రష్మిక నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల. ఈ సినిమాతోనే రష్మిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందుకే వెంకీ కుడుముల-రష్మిక మధ్యలో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.

ఈ ఫ్రెండ్షిప్ తోనే వెంకీ కుడుముల సరదాగా రష్మికను ఆటపట్టించాలని ప్రయత్నించాడు. అయితే గీత మేడమ్ ను ఆటపట్టించడం వీలుకాదు కదా.. వెంటనే ఒక కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే వెంకీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో వెంకీ -నితిన్ ఏదో సీరియస్ గా చర్చిస్తూ ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో రష్మిక కూడా ఉంది. ఈ ఫోటోతో పాటు “నితిన్ అన్న..నేను ఇద్దరం సీరియస్ డిస్కషన్ లో ఉంటే వెనక చేరి రష్మిక ఏం చేస్తోంది # భీష్మ ఫస్ట్ షెడ్యూల్” అంటూ ట్వీట్ చేశాడు. దీనికి రెప్లై ఇస్తూ రష్మిక “ఏయ్.. వెంకీ కుడుముల నన్ను కూడా మీ ఫోటోలను పోస్ట్ చేయమంటావా..అప్పుడు నువ్వు నితిన్ కలిసి వెనక ఏం చేస్తున్నారో అందరికీ తెలుస్తుంది” అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

దీనికి రిప్లై ఇచ్చిన వెంకీ “ఏంటి పుచ్చకాయ. కమాన్.. పోస్ట్ చెయ్.. పోస్ట్ చేస్తే మేము ఏం చేశామో చూస్తాం” అంటూ కాస్త రెచ్చగొట్టాడు. వెంకీ – రష్మికల మధ్య ఈ రకంగా చర్చ సాగుతుండంతో ఇక తప్పదన్నట్టుగా ఎంటరైన నితిన్ భయ్యా “వెనకైతే ఏంటి… ముందైతే ఏంటి.. మేము పని గురించి మాత్రమే మాట్లాడతాం.. కానీ మీరు మధ్యలో షాట్స్ గ్యాప్ లో ఎవరిపై దృష్టి పెడతారు సార్” అంటూ రిప్లై ఇచ్చాడు. అంటే ఒకవైపు రష్మికకు సమాధానం ఇస్తూనే.. వెంకీని వర్క్ పై దృష్టి పెట్టమని ఎంతో గౌరవంతో కూడిన మర్యాదతో గుర్తు చేశాడు.
Please Read Disclaimer