రూటు మార్చిన గీత మేడమ్

0

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న న్యూ జెనరేషన్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగుళూరు భామ ‘గీత గోవిందం’ సక్సెస్ తో భారీ ఫాలోయింగ్ సాధించింది. అయితే ఆ సినిమా తర్వాత రష్మిక నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. అలా అని రష్మిక క్రేజ్ తగ్గలేదు.. ఆఫర్లూ తగ్గలేదు. ఫుల్ జోష్ లోనే ఉంది. మరో విషయంలో కూడా జోరు పెంచింది.

రష్మిక ఈ జెనరేషన్ హీరోయిన్ కావడంతో మొదటి నుంచి సోషల్ మీడియాలో స్పీడే. ఏ అప్డేట్ ఉన్నా వెంటనే నెటిజన్లతో పంచుకుంటుంది. అయితే ఇతర భామల తరహాలో హాటు ఫోటో షూట్లు చేయడం తక్కువే. అందుకే తన సోషల్ మీడియా ఖాతాలలో హాటు ఫోటోలు కనపడవు. పక్కింటి అమ్మాయి స్టైల్లోనే ఉంటుంది. కానీ అదంతా గతం. కాంపిటీషన్ పెరిగింది.. ఇక సత్తెకాలం సత్తెమ్మలాగా ఉంటే లాభం లేదు అనుకుందేమో.. రష్మిక రూటు మార్చి హాట్ గేర్ వేసింది. కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి “మనం కొంచెం స్పైసీగా మారుద్దాం… ఏ సెలబ్రిటీతో మీరు డేట్ కు వెళ్ళాలని అనుకుంటున్నారు.. ఎవరికోసం డబ్బు ఖర్చు చేస్తారు?” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ముందుగా ఫోటోల గురించి మాట్లాడుకుంటే మెరుస్తూ ఉండే ప్యాంట్ షర్టు ధరించింది. బ్లేజర్ లాగా ఉండే షర్టు ధరించి బటన్లు పెట్టుకోకుండా వదిలేసింది. దీంతో పక్కింటి అమ్మాయి లాంటి రష్మిక కాస్తా పక్కా హాట్ రష్మికలా మారిపోయింది. ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన మొదలుపెడితే రష్మిక ఫ్యూచర్లో ఇతర హాటు భామలకు పోటీగా మారడం ఖాయమే. ఈ ఫోటోలకు నెటిజన్ల కామెంట్లు కూడా అదిరిపోయాయి. “బాలీవుడ్ స్టైల్”.. “నీతోనే డేట్ కు వెళ్ళాలని ఉంది”.. “బాంబ్ షెల్ పోజు” అంటూ కామెంట్లు పెట్టారు. రష్మిక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ తో ‘భీష్మ’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. తమిళ సినిమా ‘సుల్తాన్’ లో కూడా రష్మిక హీరోయిన్.
Please Read Disclaimer