పుష్ప.. బన్నితో పోటీపడాలనే ఇంత కసిగా శ్రమిస్తోందా?

0

నేటితరం నాయికలకు అందం ఆరోగ్యంపై శ్రద్ధ అంతా ఇంతా కాదు. తీరైన రూపంతో ఇతర భామలకు పోటీనివ్వాలన్న తపన మరీ ఎక్కువ. ఇలియానా.. కరీనా.. దిశాపటానీ వీళ్లంతా బాలీవుడ్ లో పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో ఆకట్టుకుంటుంటే … ఇటీవల సౌత్ భామలు ఏమాత్రం తగ్గడం లేదు. మునుపటిలా బొద్దుగా కనిపించేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. స్లిమ్ గా సంథింగ్ స్పెషల్ గా కనిపించేందుకు నిరంతరం జిమ్ముల్లో శ్రమిస్తున్నారు.

టాలీవుడ్ లో సమంత ఈ విషయంలో అందరికంటే ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు అదే బాటలో అందాల రష్మిక మందన ఫిట్నెస్ గోల్స్ తో దూసుకుపోతోంది. వరుసగా అగ్ర హీరోల ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ ఎందులోనే తగ్గడం లేదు.

ఫిట్నెస్ కోసం రష్మిక మందన్న కఠోరంగానే శ్రమిస్తోంది. తరచూ జిమ్ లో తన వర్కౌట్ల కు సంబంధించిన అనేక ఫోటోలు.. వీడియోలను తన సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తోంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ ఇన్ స్టా వీడియో ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది.

వీడియోలో రష్మిక మందన్న జిమ్ లో బరువులు ఎత్తుతూ హార్డ్ వర్క్ చేస్తోంది. అంతగా హెవీవెయిట్లను అప్రయత్నంగా అలా ఎత్తేస్తోంది. రష్మికలో అంత అపారమైన శక్తి ఉందా? అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది ఈ వీడియో. అసలే అల్లు అర్జున్ లాంటి కండల హీరో సరసన నటిస్తోంది. అందుకేనా ఇంత పంతంతో కసిగా వర్కవుట్లు చేస్తోంది? అంటూ ఫ్యాన్స్ ఒకటే గుసగుసలు స్టార్ట్ చేశారు. `పుష్ప`లో బన్నితో పోటీపడుతూ.. ఫిట్ గా కనిపించే ప్రయత్నమే ఇది. మునుపటితో పోలిస్తే.. సన్నజాజి తీగలాగా రష్మిక మేకోవర్ షాకివ్వబోతోందన్నమాట.