గ్లామర్ షోతో మతుల్ పోగొడుతున్న రష్మిక!!

0

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్ల సందడి మాములుగా లేదు. ఆ కుర్ర హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఫస్ట్ సినిమాతోనే తెలుగు కుర్రాళ్ళను తన క్యూట్ హావభావాల వలలో పడేసుకుంది. అప్పటి నుండి చివరిగా విడుదలైన భీష్మా సినిమా వరకు కుర్రాళ్లను అలాగే కట్టిపడేస్తోంది. ఇప్పటి వరకు అన్నీ బబ్లీ క్యారెక్టర్స్ చేసిన రష్మిక త్వరలోనే ఓ ఛాలెంజింగ్ రోల్ చేయనుంది. అది ఎందులోనో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న ‘పుష్ప’ సినిమాలో.. ఈ సినిమాలో రష్మిక చిత్తూరు అమ్మాయిగా నటించనుంది. అందుకని అక్కడి బాషా యాస నేర్చుకోవలసి ఉంది. అమ్మడు షూటింగ్ కి సిద్ధం అయ్యే టైంలో కరోనా వచ్చింది. మొత్తం రష్మిక ఆశలన్నీ ఆవిరి చేసింది. ఎందుకంటే పుష్ప సినిమా పై అమ్మడు చాలా ఆశలే పెట్టుకుంది.

ఆ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి.. ఇండియాలోని అన్నీ రాష్ట్రాల సినీప్రియులకు రష్మిక పరిచయం అవుతుంది. అప్పుడు ఇంకా సూపర్ ఫేమ్ వస్తుందని ఆశించింది. కానీ కరోనా రష్మికను ఇంటికే పరిమితం చేసింది. ప్రస్తుతం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో షూటింగ్స్ నిలిపేశారు. ఇక ఇంట్లో ఉంటూ అమ్మడు ఖాళీగా ఉంటుంది అనుకోకండి. కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు చేరువవుతుంది. తాజాగా అమ్మడు ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసినట్లుంది. ‘జస్ట్ ఫర్ విమెన్’ మ్యాగజైన్ కోసం షూట్లో పాల్గొంది రష్మిక. ఆ ఫోటోలో అమ్మడి గ్లామర్ షో అదిరిపోయిందని చెప్పాలి. గోల్డ్ కలర్ టాప్.. హై హీల్స్ తో అభిమానులకు మతులు పోగొడుతుంది. ఎందుకంటే అమ్మడు అంత గ్లామరస్ గా ముస్తాబైంది మరి. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.