లేత హొయలతో కుర్రకారును ఫిదా చేస్తున్న ఛలో భామ!!

0

ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ ‘కిర్రాక్ పార్టీ’ భామ రష్మిక మందన. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు అందరినీ బుట్టలో వేసుకుంది. ఇక రష్మిక చిలిపి అల్లరి ముచ్చటైన హావభావాలతో కుర్రకారుకి విపరీతంగా నచ్చేసింది. ఆ క్యూట్ నెస్ తోనే.. ఛలో గీతగోవిందం సరిలేరు నీకెవ్వరూ భీష్మా లాంటి వరుస విజయాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అమ్మడికి భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు నితిన్ తో భీష్మ సినిమాల విజయాల తర్వాత అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఏకంగా ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో ఛాన్స్ కొట్టేసింది. పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రష్మిక వరుస హిట్లతో జోరు కొనసాగిస్తుందని చెప్పాలి. ఇండస్ట్రీలో రష్మిక క్రేజ్ కూడా అలాగే ఉంది.

అయితే రష్మిక సినిమాలే కాకుండా గ్లామరస్ మ్యాగజైన్లలో కూడా దర్శనమిస్తుంది. ఎల్లపుడు సోషల్ మీడియాలో అలర్టుగా ఉండే రష్మిక ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోయిన్లు వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రష్మిక తాజాగా ఓ గ్లామరస్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడిని చూస్తూ కుర్రకారు ఫిదా అవుతున్నారు. అమ్మడి గ్లామర్ లుక్ లేత లేత హొయలు చూస్తూ మనసులో దేవతలా కొలుస్తున్నారు అభిమానులు. ఈ కన్నడ కుర్రభామ బ్లాక్ అండ్ వైట్ స్టైలిష్ లుక్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటున్న రష్మిక షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా.. అని ఎదురు చూస్తుందట. చూడాలి మరి రష్మిక ఆశ నెరవేరుతుందేమో..!