గీత రెమ్యూనరేషన్ ప్రవచనం అదిరిందిగా..!

0

ఉద్యోగస్తులందరికీ ఒకటే దృష్టి.. ఎప్పుడెప్పుడు జీతం వస్తుందా అన్ని నెల రోజులూ ఎదురు చూడడం. ఎప్పుడెప్పుడు హైక్ వస్తుందా అని ఏడాదిపాటు ఎదురు చూడడం. సాధారణ ఉద్యోగస్తులే కాదు ఎవరి దృష్టి అయినా తమ సంపాదన మీదే ఉంటుంది. ఇదేమీ గండికోట రహస్యం కాదు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని పంచ్ వేసింది రష్మిక మందన్న.

‘ఛలో’ లాంటి హిట్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘గీత గోవిందం’ తో స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరేందుకు రెడీ అయిన రష్మిక మందన్నకు ఇప్పుడు చేతిలో ఫుల్ గా ఆఫర్లు ఉన్నాయి. మహేష్ బాబు.. అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు ఉన్నాయి. అయితే రష్మిక స్వతహాగా కన్నడ నటి. ఈమధ్య స్టార్డం రావడంతో రెమ్యూనరేషన్ పెంచేసి కన్నడ ఫిలిం మేకర్లకు అందుబాటులో లేకుండా పోయిందనే టాక్ శాండల్ వుడ్ లో జోరుగా వినిపిస్తోందట. రష్మిక ను ఈమధ్య సంప్రదించిన కొందరు కన్నడ నిర్మాతలకు ఆ భారీ రెమ్యూనరేషన్ విని షాక్ తగిలిందట. రీసెంట్ గా ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్స్ సందర్బంగా బెంగుళూరు వెళ్ళింది. అక్కడ ప్రెస్ మీట్ లో ఈ రెమ్యూనరేషన్ టాపిక్ ను ప్రస్తావించారు. రష్మిక చాలా తెలివిగా తన రెమ్యూనరేషన్ పెంపు విషయాన్ని సమర్థించుకుంది.

‘కిరిక్ పార్టీ’ విడుదలై ఇప్పటికి రెండేళ్ళయిందని.. కెరీర్ లో ముందుకు వెళ్ళాలనే ఆశ తనకు కూడా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతే కాదు “మీరు మీడియాలో పని చేస్తారు. మీ కెరీర్ లో కూడా జీతం రెగ్యులర్ గా పెరగాలని.. ప్రమోషన్లు రావాలని ఆశిస్తారు. నేను కూడా అలానే కదా” అంటూ ఎవరూ కూడా కాదనలేని.. తిరిగి మరో ప్రశ్న వేయలేని కిరాక్ లాజిక్ ను వినిపించింది. అలాంటి లాజిక్ విన్న తర్వాత ఎవరైనా ఇంకేం చేస్తారు… ముసిముసి నవ్వులు నవ్వుకుని ‘తెలివైన పిల్ల’ అనుకొని సరిపెట్టుకుంటారు. అయినా ఈ లాజిక్కులు రష్మిక దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నాయో లేక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేర్చుకుందో!
Please Read Disclaimer