ముద్దుల లెక్క మాత్రం టాప్ సీక్రెట్ అంటోంది!

0

కథ డిమాండ్ చేయటంతో గ్లామర్ మరింత పండించాల్సి వచ్చిందని.. బోల్డ్ సీన్లు చేయాల్సి వచ్చిందని.. ముద్దు విషయాల్ని కథలోని పాత్రలుగానే చూడాలే తప్పించి.. వ్యక్తుల్ని కాదంటూ చెప్పే మాటలు చాలానే వినిపిస్తుంటాయి. తాజాగా రిలీజ్ కానున్న డియర్ కామ్రేడ్ లో ముద్దుల లెక్క ఎక్కువన్న విషయం ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్ని చూస్తే అర్థం కాక మానదు.

ముద్దుల మాటకు కామ్రేడ్ బాబు రియాక్ట్ అవుతూ.. విజయ్ దేవరకొండ.. రష్మిక ముద్దులు పెట్టుకున్నట్లుగా చూడకూడదని.. తెర మీద పాత్రల మధ్య జరిగినట్లుగా చూడాలంటూ.. సినిమాను ఎలా చూడాలో కొత్త తరహా సుద్దలు చెప్పటం షురూ చేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా కామ్రేడ్ భామ రష్మిక.. సినిమాలో ముద్దులు ఎక్కువైనట్లున్నాయే అంటే ఆసక్తికర రీతిలో రియాక్ట్ అయ్యారు.

సినిమాలో నిజంగానే ముద్దులు పెట్టుకున్నారా? లేక.. కెమెరా ట్రిక్కా? అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా.. అవన్నీ చెప్పేయకూడదు.. టాప్ సీక్రెట్ అంటూ ఉత్సుకత పెంచేలా సమాధానం ఇచ్చారు. ఇక్కడితో ఆపని బ్యూటీ.. అయినా.. హీరోహీరోయిన్ల ముద్దు అనగానే పొదలు.. పూవులు ఊపటం చూపిస్తే ఈతరం ప్రేక్షకులు ఒప్పుకోరు కదా? అంటూ ముద్దులకు కారణం ప్రేక్షకులే అని భలేగా తోసేసింది. కథ డిమాండ్ చేయటం కంటే.. ప్రేక్షకుల మనసుల్ని దోచుకునేందుకే ముద్దులన్నట్లుగా అమ్మడి మాటలున్నాయి కదా?
Please Read Disclaimer