ఓటీటీ మూవీపై రష్మిక కామెంట్స్

0

గత మూడు నెలలుగా థియేటర్లు తెరుచుకోని కారణంగా పలు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే పెంగ్విన్ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. వెబ్ మీడియాలో మాత్రం సినిమాకు ఎక్కువ శాతం నెగటివ్ రివ్యూలు వచ్చాయి. కమర్షియల్ గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేదు అంటూ విమర్శలు వచ్చాయి.

తాజాగా ఈచిత్రంపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న స్పందించింది. సోషల్ మీడియా ద్వారా పెంగ్విన్ సినిమాపై తన అభిప్రాయంను షేర్ చేసుకుంది. ఈమె పెంగ్విన్ సినిమాపై పాజిటివ్ గా కామెంట్స్ చేసింది. గత రాత్రి నేను కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ సినిమాను చూశాను. కీర్తి సురేష్ సినిమాలో నీ నటన బ్రిలియంట్. ఒక తల్లిగా కుటుంబ సభ్యుల పట్ల చూపించే బాధ్యతను నువ్వు చూపించావు. ఇది అందరు తల్లులకు చాలా దగ్గరగా ఉంటుంది. సినిమా ఆధ్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఇంకా ఇతర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్. తప్పకుండా మీరంతా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాను చూడండి అంటూ ట్వీట్ చేసింది.

రష్మిక మందన్న పెంగ్విన్ పై చేసిన వ్యాఖ్యలపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు రష్మిక అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లుగా పేర్కొనగా మరికొందరు మాత్రం డబ్బులు తీసుకుని రష్మిక ఈ ట్వీట్ చేసిందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. డబ్బు కోసం చెత్త సినిమాలను ప్రమోట్ చేయడం అవసరమా. ఈ సినిమా ప్రేక్షకుల టైం వేస్ట్ అంటూ కొందరు నెగటివ్ కామెంట్స్ చేశారు.
Please Read Disclaimer