ఇంతకీ మంకీ ఎవరు.. నితినా.. మహేషా?

0

చాలా తక్కువ సమయంలో ఊహించని క్రేజుతో టాలీవుడ్ లో అసాధారణ స్టార్ డమ్ అందుకుంది రష్మిక మందన. ఇప్పటివరకూ టాలీవుడ్ లో ప్రవేశించిన ఏ కన్నడ బ్యూటీకి ఇంత సీన్ లేదని నిరూపించింది ఈ అమ్మడు. ఛలో- గీత గోవిందం లాంటి వరుస బ్లాక్ బస్టర్లు ఈ అమ్మడిని గోల్డెన్ లెగ్ గా నిలబెట్టాయి.

ప్రస్తుతం మహేష్.. నితిన్ లతో సినిమాలు చేస్తోంది. బన్ని సరసన అవకాశం అందుకుంది. ఈ స్పీడ్ ఇకపైనా ఇలానే కొనసాగించేందుకు ప్రణాళికలు వేస్తోంది. అందుకే కన్నడ ప్రియుడికి పెళ్లికి కటీఫ్ చెప్పేసిందన్న టాక్ అభిమానుల్లో ఉంది. అదంతా సరే.. ఇన్ స్టాలో అందాల రష్మిక ఓ లేటెస్ట్ ఫోటోని షేర్ చేసి దానికి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది.

“ఈ పిక్చర్ లో ఒకే ఒక్కటి మిస్సింగ్. అది మంకీ.. నా ప్లస్ వన్ మంకీ!“ అంటూ ఏదేదో అర్థమయ్యీ అవ్వనట్టు నర్మగర్భంగానే సందేశం ఇచ్చింది. ఒక రకంగా ఆ మిస్సయిన మంకీ ఎవరో కనిపెట్టండి! అంటూ ఫ్యాన్స్ కి ఫజిల్ వేసిందనే అనుకోవాలి. ఇంతకీ ఎవరా మంకీ? నితినా.. మహేషా? అన్న సస్పెన్స్ నెలకొందిప్పుడు. ఫజిల్ విప్పలేక ఫ్యాన్స్ బుర్రలు పీక్కోకపోయినా.. మహేష్ ఎలానూ మ్యారీడ్ జెంటిల్మన్ కాబట్టి అతడిని మంకీ అని పిలిచే ఛాన్సే లేదు. నితిన్ మాత్రం ఇంకా బ్యాచిలర్ మంకీ. పైగా `భీష్మ`లో రష్మిక వెంటపడుతూ వేస్తున్న కోతి వేషాలు బయటపడ్డాయ్. అందుకే ఆ మిస్సయిన మంకీ నితిన్ అని అర్థం చేసుకోవాలి. పనిలో పనిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలోనూ.. ప్రొఫెసర్ భారతికి కీడు తలపెట్టే విలన్లను చితకేసే జెంటిల్మన్ గానూ నటిస్తున్నారు. అందువల్ల రష్మిక అతడిని పేరు పెట్టి అనలేదు మరి!!
Please Read Disclaimer