మెట్రోలో కళ్లన్నీ గీతపైనే

0

`గీత గోవిందం` చిత్రంలో గీత పాత్రలో నటించిన రష్మికకు యువతరంలో ఏ స్థాయి క్రేజు ఉందో తెలిసిందే. ఆ సినిమాలో కీలక సన్నివేశాల్ని ఓ బస్ లో చిత్రీకరించారు. హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రయాణమైన ఓ ట్రావెల్ బస్ లో గీత వల్ల ఊహించని ప్రాబ్లెమ్ లో ఇరుక్కునే గోవిందంగా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించారు.

గోవిందాన్ని ఆడుకునే గీతగా అద్భుతంగా నటించిన రష్మిక కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. గీత గోవిందం చిత్రం రిలీజ్ తర్వాత రష్మిక సీన్ మొత్తం మారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్మికకు గొప్ప ఫాలోయింగ్ ఉంది. తను ఎక్కడికి వెళ్లినా యూత్ కళ్లు అటే వాలిపోతాయి. అయితే అనూహ్యంగా రష్మిక హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి అందరికీ షాకిచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలా ఎంతో సింపుల్ గా మెట్రో ఎక్కి ప్రయాణించింది. ఆ కళ్లకు అదరిపోయే సన్ గ్లాసెస్ ని పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ గుండెల్లో గుచ్చేసింది అంతే.

అన్నట్టు రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ స్టార్. ఓవైపు మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తూనే.. మరోవైపు తమిళంలోనూ నటించేస్తోంది. బన్ని-సుకుమార్ చిత్రంలోనూ ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer