అతడి కామెంట్ తో చాలా బాధపడ్డ రష్మిక

0

తమ ప్రొఫెషనల్ లైఫ్ మరియు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను జనాలతో పంచుకోవడంతో పాటు పాపులారిటీ పెంచుకోవడానికి సెలబ్రెటీలు దాదాపు అంతా కూడా ఈమద్య కాలంలో సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియా వల్ల సెలబ్రెటీలు ఎంతగా ప్రాచుర్యం పొందుతున్నారో అంతే ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. సెలబ్రెటీల దృష్టి ఆకర్షించేందుకు లేదంటే మరేదో కారణం వల్ల ప్రతి ఒక్కరికి బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు.

ఇటీవల రష్మిక సౌత్ లో చాలా ఫేమస్ అయ్యింది. ఆమెను అభిమానించే వారి సంఖ్య చాలా పెరిగింది. అదే సమయంలో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వారి సంఖ్య కూడా అధికం అయ్యింది. ఒక నెటిజన్ రష్మిక చిన్నప్పటి ఫొటోలను పోస్ట్ చేసి చాలా అసభ్యంగా కామెంట్ పెట్టాడు. అతడి మాటతో రష్మిక అభిమానులు చాలా హర్ట్ అయ్యి అతడిపై సోషల్ యుద్దమే చేశారు. ఆ విషయం రష్మిక వద్దకు కూడా వెళ్లడంతో ఆమె స్పందించింది.

తన సోషల్ మీడియా పేజ్ లో అతడి పోస్ట్ పెట్టి ఇలాంటివి చేస్తే మీకు ఏమి వస్తుందో నాకైతే అర్థం అవ్వడం లేదు. పదే పదే సెలబ్రెటీలను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తు ఉంటారు. మీలో కొందరు ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని అంటారు. కాని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మనసు బాధపడేట్లుగా కామెంట్స్ చేస్తే స్పందించకుండా ఎలా ఉంటామంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక సెలబ్రెటీ అయినంత మాత్రాన వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తే పడుతూ ఉండాలా. యాక్టర్ అయ్యేందుకు తాము చాలా కష్టపడతాం. ఏ రంగంలో ఉన్నా కూడా వారు చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వాలంటూ రష్మిక కోరింది. ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి నన్ను బాధపెట్టడంలో సక్సెస్ అయ్యారు.. అందుకు మీకు కంగ్రాట్స్ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.

సెలబ్రెటీలు ఇలాంటి కామెంట్స్.. బూతులు ఎదుర్కుంటూనే ఉంటారు. గతంలో కూడా పలువురు హీరోయిన్స్ తమపై వచ్చిన కామెంట్స్ కు ఇలాగే చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. అయినా కూడా వారిని వదలకుండా ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి వేదిస్తూనే ఉంటారు.
Please Read Disclaimer