ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రష్మిక

0

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరే దిశగా అడుగులు వేస్తున్న భామ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో నటించిన ‘డియర్ కామ్రేడ్’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రష్మిక సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. విజయ్ తో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్స్ లో పాల్గొంటూ సినిమాపై క్రేజ్ ను మరింతగా పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రమోషన్స్ లో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడింది.

‘డియర్ కామ్రేడ్’ తర్వాత రష్మిక సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ లో హీరోయిన్ గా నటిస్తోందనే విషయం తెలిసిందే. మహేష్ బాబుతో కలిసి నటించడం రష్మికకు ఇది మొదటిసారి. అయితే ఈ సినిమా చాలారోజుల క్రితమే ప్రారంభమైనా రష్మిక మాత్రం షూటింగ్ లో జాయిన్ కాలేదు. ఈ సినిమాలో నటించడం గురించి రష్మికను ప్రశ్నిస్తే “ఎప్పుడెప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుదామా అని ఎదురు చూస్తున్నాను. మహేష్ సర్ తో కలిసి నటించేందుకు సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నా” అంటూ తన ఎగ్జైట్ మెంట్ ను దాచుకోకుండా బయటపెట్టింది.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో విజయశాంతి.. ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర.. దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.
Please Read Disclaimer