బీచ్ లో రష్మిక వర్కౌట్

0

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన రష్మిక సుకుమార్ నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఆమె తిరిగి వెళ్లి పోయారు. ప్రస్తుతం రష్మిక మందన్న కర్ణాటకలో ఉంది. త్వరలోనే పుష్ప షూటింగ్ లో జాయిన్ కాబోతుంది. ఈ ఖాళీ సమయంను ఆమె ఫుల్ గా వాడేసుకుంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేయడంతో పాటు చాలా సంతోషంగా గడిపేస్తుంది. ఇదే సమయంలో ఆమె ఫిజిక్ విషయంలో ఏమాత్రం లైట్ తీసుకోకుండా వర్కౌట్స్ మరియు యోగా చేస్తుంది.

తాజాగా రష్మిక ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రష్మిక ఒక బీచ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఇసుకలో ఆమె కష్టపడుతోంది. హీరోయిన్స్ సరైన ఫిజిక్ ను మెయింటెన్ చేయాలంటే ఈమాత్రం కష్టపడాల్సిందే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎవరికి దక్కని విధంగా సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ సినిమాలతో రెండు సక్సెస్ లను దక్కించుకుంది. చాలా మంది హీరోయిన్స్ కనీసం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోయారు. కరోనా కారణంగా స్టార్ హీరోయిన్స్ ఈ ఏడాదిలో అసలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. కాని రష్మిక లక్కీగా రెండు సక్సెస్ లతో నిలిచింది.