ఆమెతో స్క్రీన్ షేరింగ్ కు రష్మిక నో చెప్పిందట

0

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఛాన్స్ ను కాదన్నది అంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. నానితో నటించేందుకు రష్మిక నో చెప్పిందనే వార్త వైరల్ అయ్యింది. తాజాగా ఆ విషయమై మరో కథనం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో మొదటి హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోగా మరో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్నను సంప్రదించారట.

ప్రస్తుతం తనకున్న క్రేజ్ నేపథ్యంలో మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా భావించి ఆ సినిమాకు రష్మిక నో చెప్పిందట. సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర అవ్వడంతో కనీసం పూర్తి స్క్రిప్ట్ కూడా వినకుండా రష్మిక సినిమాకు నో చెప్పిందని కూడా టాక్ వినిపిస్తుంది. తెలుగు మరియు తమిళంలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న రష్మిక ఎలా సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు అంగీకరిస్తుందని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు ఇంకా భీష్మ చిత్రాలతో సక్సెస్ లు దక్కించుకున్న ఈ అమ్మడు అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప చిత్రంలో నటిస్తోంది. ఇంకా తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ కోలీవుడ్ లో బిజీగా ఉన్న రష్మిక టైర్ 2 హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు అంటున్నారు.
Please Read Disclaimer