రష్మిక స్కిన్ షో.. ఫ్యాన్స్ కి డబుల్ కిక్

0

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన `సరిలేరు నీకెవ్వరు` నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఆడియో స్లోపాయిజన్ లా శ్రోతలకు చేరువైంది. దేవిశ్రీ సంగీతానికి ఆరంభంలో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా మాస్-క్లాస్ కి కావాల్సిన బీట్స్ ని బ్యాలెన్సింగ్ గా ఇవ్వడంలో సఫలమయ్యాడు. హీ ఈజ్ సోక్యూట్…మైండ్ బ్లాంక్ పాటలకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నేడు సినిమా విడుదలైన నేపథ్యంలో మైండ్ బ్లాక్ సాంగ్ మహేష్-రష్మిక మాస్ స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారట. ఈ పాట అంచనాలను మించి ఫ్యాన్స్ ని మురిపిస్తోందట.

మొత్తం పాటలన్నింటిలోకీ మైండ్ బ్లాక్ సాంగ్ మహేష్ మాస్ ఫ్యాన్స్ కి విజువల్ గాను మంచి ట్రీట్ ఇస్తోంది. మహేష్ తో ఎగ్రెసివ్ గాళ్ రష్మిక సరసాలు పాటలో హైలైట్ గా నిలిచాయని ఫీడ్ బ్యాక్ అందుతోంది. రష్మిక స్కిన్ షో ఫ్యాన్స్ కి డబుల్ కిక్ నిస్తోంది. పొట్టి పిల్ల స్టెప్పులు గట్టిగానే వేస్తోందని ప్రశంసలందుకుంటోంది. మహేష్ కంటే రష్మికకే ఈ పాటతో మంచి గుర్తింపు దక్కుతుందని పొగిడేస్తున్నారు కొందరైతే. గతంలో ఈ భామ విజయ్ దేవరకొండతో వేసిన లిప్ లాక్ లకు ఎంత గుర్తింపు వచ్చిందో అంతకు మించి ఈ సాంగ్ గురించి మాట్లాడుకోవడం ఖాయమేనట. ఈ పాట సోషల్ మీడియా సహా మాస్ ఆడియన్స్ లోనూ ట్రెండింగ్ గా నిలువనుంది.

ఈ సినిమా రివ్యూలు మరి కాసేపట్లో వెబ్ ని ముంచెత్తనున్నాయి. మహేష్ చెప్పినట్లే బొమ్మ థియేటర్లో దద్దరిల్లడం ఖాయమేనా లేదా? హైప్ కి తగ్గట్టే సినిమాలో మ్యాటర్ ఉందా లేదా? అన్నది తెలియాలంటే మరికాసేపట్లో తుపాకి రివ్యూ కోసం.. జస్ట్ వెయిట్.
Please Read Disclaimer