కెరీర్ గురించి తెగ టెన్షన్ పడుతున్న రష్మిక

0

ఛలో తో తెలుగు తెరంగేట్రం చేసిన రష్మిక తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈమె నటించిన డియర్ కామ్రేడ్ నేడు విడుదల అయ్యింది. ఇది కనుక సక్సెస్ అయితే రష్మికకు స్టార్ హీరోల నుండి వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తోంది. రష్మిక కెరీర్ రాబోయే నాలుగు అయిదు సంవత్సరాల్లో చాలా బిజీగా ఉండబోతుంది. అయితే ఈ సమయంలో వస్తున్న కొన్ని వార్తలు తన కెరీన్ ను నాశనం చేసే అవకాశం ఉందని ఆమె టెన్షన్ పడుతోంది.

విజయ్ దేవరకొండతో వరుసగా రెండు చిత్రాలు చేయడంతో పాటు ఆ చిత్రాల్లో ముద్దు సీన్స్ చేయడం మరియు ఆయనతో చాలా క్లోజ్ గా ఆఫ్ స్క్రీన్ కూడా ఉంటున్న కారణంగా ఇద్దరి మద్య వ్యవహారం ఉందని పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. ఇలా ఒక హీరోయిన్ గురించి మీడియాలో వార్తలు వస్తే ఆ హీరోయిన్ తో నటించేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపించరు. ఇప్పుడు అదే భయం రష్మిక మనసులో ఉంది. అందుకే ఆమె పదే పదే విజయ్ దేవరకొండ తనకు స్నేహితుడు మాత్రమే అని.. నా కుటుంబ సభ్యులు ఈ విషయంలో చాలా ఫీల్ అవుతున్నారు మరోసారి విజయ్ తో నేను నటించక పోవచ్చు అంటూ రష్మిక చెప్పింది.

ప్రతి ఇంటర్వ్యూలో కూడా తమ ఇద్దరి మద్య ఏమీ లేదు అంటూ చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. మీడియాలో తమ ఇద్దరి గురించి వస్తున్న వార్తలను విజయ్ దేవరకొండ కూడా ఖండించాడు. రౌడీ చాలా కూల్ గా ఉన్నా రష్మిక మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఆఫర్ల గురించి ఆమె పదే పదే పుకార్లను ఖండిస్తోంది.
Please Read Disclaimer