ఆ నియమాన్ని నేనేం మార్చుకోలేదు : రష్మిక

0

‘ఛలో’ చిత్రంతో తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న అదృష్టంతో వరుసగా మంచి చిత్రాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటుంది. వరుసగా అవి కూడా విజయాలు దక్కించుకుంటున్నాయి. దాంతో ఈ అమ్మడి క్రేజ్ సినిమా సినిమాకు పెరిగి పోతూనే ఉంది. మొన్న సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో వచ్చిన రష్మిక ఇటీవల భీష్మ చిత్రంలో నితిన్ కు జోడీగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం మరో రెండు పెద్ద సినిమాల్లో కూడా ఈమె నటిస్తోంది.

బిజీ షూటింగ్స్ కారణంగా వర్కౌట్స్ ఎక్కువగా చేసే సమయం ఉండటం లేదట. అందుకే ఆరు నెలల నుండి తనకు ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ ను వదిలేసినట్లుగా ఈ అమ్మడు భీష్మ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అయినా కూడా నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్న కారణంగా బిర్యానీ ని కూడా ముట్టడం లేదని చెప్పింది. అలాంటి రష్మిక ఇటీవల ఒక కార్యక్రమం లో చికెన్ తింటున్నట్లు గా ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

రష్మిక నాన్ వెజ్ తినను అంటూనే మళ్లీ ఇదేంటీ అంటూ చాలా మంది ప్రశ్నించారు. నెటిజన్స్ ప్రశ్నకు రష్మిక సమాధానం ఇచ్చింది. అది కేవలం ఫొటోకు ఫోజు ఇచ్చాను అంతే. నేను అన్నట్లుగానే నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నాను. నేను నాకు విధించుకున్న నియమాన్ని మార్చుకో లేదు అంది. అది ఎప్పటి వరకు అనేది చెప్పలేను కాని నాన్ వెజ్ తినడం అయితే మానేశాను అంటూ రష్మిక మరోసారి క్లారిటీ ఇచ్చింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-