రష్మిక వర్సెస్ పూజ.. ఎవరు బెస్ట్?

0

కన్నడ బ్యూటీ రష్మిక మందన.. ముంబై బ్యూటీ పూజా హెగ్డే మధ్య గట్టి పోటీ నెలకొందా? ఇద్దరిలో ఎవరిది అప్పర్ హ్యాండ్? ఎవరు బెస్ట్? అంటూ మహేష్.. బన్ని అభిమానుల్లో డిబేట్ రన్ అవుతోంది. ఒకరు కవ్వింతలో బెస్ట్ అయితే..మరొకరు గ్లామర్ షో లో హైలీ ట్యాలెంటెడ్? మరి సంక్రాంతికి అల.. సరిలేరు పోటీలో ఎవరు ఎక్కువ మనసు దోచేస్తారు? అంటే ఆసక్తికర విషయాలే బయటకు వస్తున్నాయి. రష్మిక కంటే పూజా సీనియర్. బాలీవుడ్ సహా టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే సక్సెస్ పరంగా రష్మిక కంటే పూజానే వెనుకబాటులో ఉంది. రష్మిక వరుస సక్సెస్ లతో ఛాన్సులు అందుకుంటుంటే..పూజ లక్కీ ఛామ్ గా గ్లామర్ ఎలివేషన్ తోనే అవకాశాలు ఒడిసిపట్టుకుంటోంది.

అయితే పూజకి హైట్ కలిసొస్తుంది. టాలీవుడ్ హీరోలకు సమ జోడీగా మ్యాచ్ అవుతోంది. ఇక రష్మిక పొట్టిదైనా గట్టిదానిగానే నిరూపించుకుంటూ అవకాశాలు అందుకుంటోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఇద్దిరికీ బాగానే ఉంది. ఫాలోయింగ్ పరంగా పొలిక చూస్తే ఓ మెట్టు రష్మిక కన్నా పూజా నే పైనుంది. అయితే అంతిమంగా ప్రేక్షకులు ఎవరికి ఎక్కువగా ఓటు వేస్తారన్నది ముందున్న సంక్రాంతి సినిమాలు డిసైడ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్మిక సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు లోనటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఎగ్రెసివ్ గాళ్ గా గత సినిమాలతో ఐడెంటిటీ సంపాదించిన పూజా సరిలేరు చిత్రంలో మహేష్ వెంట పడే చిలిపి పిల్ల గా కనిపించనుంది. ఆద్యంతం వినోదాత్మక చిత్రమిది. గ్లామర్ ఎలివేషన్ కు అంతగా ఆస్కారం లేని రోల్. ఇది కాస్త రష్మిక ఇమేజ్ కు ఇబ్బంది కల్గించేదే.

ఇటు పూజా హెగ్దే బన్నీ సరసన నటించింది. అల వైంకుఠపురములో చిత్రంలో టైటిల్ పాత్ర తనదే. త్రివిక్రమ్ సినిమా కాబట్టి పూజా పాత్రకు అనవసర గ్లామర్ ఎలివేషన్ కు ఛాన్స్ ఉండదు. బలమైన పాత్ర….సన్నివేశాలతో మెప్పించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు బాపు మార్క్ చమక్కులతో అందాల్ని ఎరవేయాలి. మరి ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏది పై చేయి సాధిస్తే…ఆ భామనే విన్నర్ గా ప్రకటించాల్సి ఉంటుందేమో.
Please Read Disclaimer