మహేష్ హీరోయిన్ వెనుక అంత కథుందా ?

0

ఈ నెలాఖరుకు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు షూటింగ్ మొదలుకానుంది. పూజా కార్యక్రమాలు అయ్యాయి కానీ రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్లడం మాత్రం హీరో వచ్చాకే స్టార్ట్ అవుతుంది. రష్మిక మందన్న ఫస్ట్ టైం మహేష్ తో నటించడం దానికి తోడు గోల్డెన్ హ్యాండ్ గా తనకు పేరుండటం ఇవన్నీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పుడు చక్కర్లు కొడుతున్న కొత్త టాక్ కొత్త చర్చకు దారి తీస్తోంది. దాని ప్రకారం నిజానికి రష్మిక ఈ ప్రాజెక్ట్ లో ముందు లేదు.

అనిల్ రావిపూడి అడిగినప్పుడు డేట్స్ ఖాళీ లేవు. నితిన్ భీష్మతో పాటు తమిళ్ లో శివ కార్తికేయన్ సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వడంతో మనసుకు కష్టమైనా నో చెప్పక తప్పలేదు. కానీ తర్వాత శివ కార్తికేయన్ తో చేస్తున్న సినిమాలో తనది వట్టి గ్లామర్ పాత్ర మాత్రమే అని తేలడమే కాక ముందు చెప్పినట్టు కాకుండా ప్రాధాన్యత తగ్గించి హీరోయిన్ రోల్ ని తిరగ రాసారని తెలుసుకుని బయటికి వచ్చేసింది

సో అవి ఖాళీ అయ్యాయి కాబట్టి సరిలేరు నీకెవ్వరు పోస్ట్ ఇంకా ఫిల్ అవ్వలేదని తెలుసుకుని వెంటనే పట్టేసింది. ఆ రకంగా టాలీవుడ్ కు పరిచయమైన రెండేళ్లకె సూపర్ స్టార్ తో సోలోగా జోడి కట్టే ఛాన్స్ కొట్టేసింది. అనిల్ రావిపూడి సినిమాల్లో ఎలాగూ హీరోయిన్లకు మంచి స్కోప్ ఉంటుంది. పటాస్ లో రాశి ఖన్నా రాజా ది గ్రేట్ లో మెహ్రీన్ ఎఫ్2లో తమన్నా ఇలా ఏది చూసుకున్న వెయిట్ బాగా ఉంటుంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులో సైతం అలాంటి స్కోప్ దక్కడంతో ఆలస్యం చేయకుండా ఓకే చెప్పిందట. మొత్తానికి మహేష్ హీరోయిన్ ఎంపిక వెనుక పెద్ద కథే నడిచిందన్న మాట