సుక్కూ-రత్నవేలు ఎక్కడ చెడింది?

0

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. అయితే సుక్కూ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాత్రం మిస్సింగ్. ఆర్య నుంచి సుక్కూ-రత్నవేలు-దేవీ త్రయం సక్సెస్ ఫుల్ రన్ గురించి తెలిసిందే. ఆ ముగ్గురూ కలిస్తే జరిగే మ్యాజిక్ ఎన్నో వండర్స్ చేసింది. కల్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి. రత్నవేలుతో సుక్కూ బంధం రంగస్థలం వరకూ విజయవంతంగా కొనసాగింది. అయితే ఏమైందో ఈసారి బన్ని సినిమాకి మాత్రం కుదరలేదు.

ఈ సందర్భంగా రత్నవేలు మిస్సింగ్ అంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా సోషల్ మీడియాలో సుకుమార్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసిన రత్నవేలు ఓ ఆసక్తికర వ్యాఖ్యను చేశాడు. “డియర్ ఆర్య సుక్కూ ఆల్ ది బెస్ట్.. ఏఏ20 చిత్రం `రంగస్థలం`లా మరో కల్ట్ క్లాసిక్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈసారికి ఒకరినొకరం మిస్సవుతున్నాం. తర్వాతి సినిమాకి కలుద్దాం. బెస్ట్ విషెస్..టు అల్లు అర్జున్- మైత్రి- దేవిశ్రీ- డీవోపీ కూబా- మోనిక రామకృష్ణ“ అంటూ ట్వీట్ చేశారు. రంగస్థలం చిత్రానికి పని చేసిన బృందమే ఇప్పుడు సుక్కూతో పని చేస్తున్నారు. ఇందులో రత్నవేలు మిస్సవ్వడం లోటు అనే చెప్పాలి. అయితే సుకుమార్ నుంచి రత్నవేలు విడిపోయాడా? అసలేం జరిగింది? ఎక్కడ చెడింది? లేదూ రత్నవేలు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ టీమ్ తో చేరలేకపోయాడా? అంటూ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

మరి ఇప్పుడు కొత్తగా సుక్కూతో జాయిన్ అయిన సినిమాటోగ్రాఫర్ కూబా ఎలాంటి పనితనం చూపిస్తాడు? రత్నవేలులా జాతీయ అవార్డు రేంజు విజువల్స్ ని ఇస్తాడా? సుక్కూ గౌరవం పెంచుతాడా? అన్నదానిపైనా రత్నవేలు ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక రత్నవేలు విషెస్ ని బట్టి ఇప్పుడు తెరకెక్కించేది మరో కల్ట్ క్లాసిక్ జోనర్ అని తేలింది. నవంబర్ లో రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్నారు.
Please Read Disclaimer