హీరోలను ఏకిపారేస్తున్న రవీనా టాండన్!

0

Raveena-Tandon-Sensational-Comments-on-Star-Hereos-and-wifesతనుశ్రీ దత్తా ఎపిసోడ్ ఇప్పుడు బాలీవుడ్ లో మాతమే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. నానా పటేకర్ 2008 లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూట్ సందర్భంగా తనను లైంగికంగా వేధించాడని.. ప్రతిఘటించినందుకు తనపై దాడి చేయించాడని ఆరోపణలు చేసింది. ఇప్పటికే దాడి విడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఎపిసోడ్ లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ తనుశ్రీ కి మద్దతు ప్రకటించారు.

సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా తనుశ్రీ కి మద్దతు ప్రకటించింది. మద్దతు ప్రకటించడమే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలను వారి భార్యలను కలిపి చురకలు అంటించింది. “వర్క్ ప్లేస్ లో వేధింపులను ఎలా డిఫైన్ చేస్తారు? నిజానికి ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది స్టార్ హీరో ల భార్యలు/గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే.. వారి భర్తలు కొత్త హీరోయిన్లను బుట్టలో వేసుకొని వాళ్ళని వాడుకొని ముచ్చట తీరగానే.. కొత్త భామలపై ఫోకస్ చేస్తారు. ఆ తర్వాత కొత్త వారు లైన్లోకి రాగానే వాళ్ళతో తిరుగుతూ అంతకు ముందున్న వారి కేరీర్లను నాశనం చేస్తారు. ఇదంతా భార్యలు సైలెంట్ గా చూస్తూ ఉంటారు లేదా భర్తలను ప్రోత్సహిస్తూ ఉంటారు” అని ట్వీటేసింది.

ఈ ట్వీట్ పై బాలీవుడ్లో ఇప్పుడు హాట్ చర్చలు మొదలయ్యాయి. రవీనా టాండన్ – అక్షయ్ కుమార్ ల మధ్యలో 90 లలో అఫైర్ ఉండేదని ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు. ఇక కొంతమంది ఈ విషయాలు ప్రస్తావిస్తూ రవీనా ఇప్పుడు అక్షయ్ కుమార్ – ట్వింకిల్ ఖన్నాలను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసిందని అంటున్నారు. ఇక మరి కొందరు మాత్రం రవీనా చెప్పేది నిజం అని.. బాలీవుడ్ లో దాదాపు సగం మంది అదే బాపతని.. విషయాలు బయటకు రాకుండా కవర్ చేస్తారని అంటున్నారు. రవీనా కామెంట్స్ చూస్తుంటే తనుశ్రీ దత్తా ఎపిసోడ్ మరిన్ని కీలక మలుపులు తీసుకుని కొత్త హీరోయిన్లు కూడా ఈ సీన్లో కి తీసుకొచ్చేలా ఉంది.