ఝకాస్ సెల్ఫీ తీసుకున్న డిస్కో రాజా జోడీ

0

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వీఐ ‘డిస్కో రాజా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైఫై టచ్ ఉండే ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. మార్చ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ తర్వాత కొద్ది రోజులు ఆగింది.. కానీ ఇప్పుడు షూటింగ్ బ్రేకుల్లేకుండా సాగుతోందట.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ‘RX 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ‘డిస్కో రాజా’ షూటింగ్ లొకేషన్లో పాయల్ రాజ్ పుత్ ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా రవితేజతో సెల్ఫీలు కూడా తీసుకుంది. ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. అయితే పాయల్ ఇంకా షూటింగ్ లో పాల్గొనలేదట. త్వరలోనే ‘డిస్కోరాజా’ టీమ్ తో జాయిన్ అవుతుందని సమాచారం. ‘డిస్కోరాజా’ టీమ్ స్విట్జర్లాండ్ షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో పాయల్ మాస్ రాజాతో జాయిన్ అయ్యే అవకాశం ఉందట.

రవితేజ నటించిన సినిమాలు ఈమధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తూ ఉండడంతో అభిమానులు ఈ సినిమాపైనే నమ్మకాలు పెట్టుకున్నారు. మరి మంచి కంటెంట్ తో సినిమాలు రూపొందిస్తాడని పేరున్న దర్శకుడు వీఐ ఆనంద్ రవితేజకు మంచి హిట్ ఇస్తాడేమో వేచి చూడాలి. ఈ చిత్రాన్ని ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer