‘ఖైదీ’ చూసి కార్తీకి ఫోన్ చేసిన రవితేజ

0

కార్తి నటించిన ‘ఖైదీ’ దీపావళి కానుకగా రిలీజై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా సినిమాకు మౌత్ టాక్ బాగుంది. ఆ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓ మోస్తరుగా కలెక్షన్స్ రాబడుతుంది.

అయితే ఈ సందర్భంగా కార్తి హైదరాబాద్ వచ్చి తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. సినిమాకు కష్టపడిన టెక్నీషియన్స్ గురించి చెప్పాడు. అందరూ రాత్రుళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారని అన్నాడు. అంతే కాదు ఈ టీమ్ తో మళ్లీ కలిసి పనిచేయాలనుందని చెప్పాడు. త్వరలోనే ఖైదీ సీక్వెల్ చేయనున్నట్లు ప్రకటించాడు. దర్శకుడితో పాటు తను కూడా బిజీ గా ఉన్నానని ఇద్దరం ఫ్రీ అయ్యాక ముప్పై రోజుల్లో సీక్వెల్ షూట్ చేస్తామని అన్నాడు.

ఇక ఖైదీ చూసి రవి తేజ గారు ఫోన్ చేసి నేను కూడా ఇలాంటి సినిమా చేస్తా చూడు అన్నారని ఆయన సినిమా గురించి చాలా సేపు మాట్లాడారని చెప్పుకున్నాడు కార్తి. సో ఖైదీ లో కార్తి రోల్ కి రవితేజ ఫిదా అయ్యాడన్నమాట. మరి నిజంగానే రవితేజ ఇలాంటి ఎక్స్ పర్మెంట్ సినిమా చేస్తాడా చూడాలి.
Please Read Disclaimer