రాజా 2.0 నుంచి టీజర్ 2.0

0

మాస్ మహారాజా రవితేజ దాదాపు ఏడాది విరామం తరువాత వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. 2020లో `డిస్కోరాజా`.. క్రాక్` చిత్రాలతో హంగామా చేయబోతున్నారు. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ వి. ఐ. ఆనంద్తో `డిస్కోరాజా`.. బలుపు ఫేం గోపీచంద్ మలినేనితో `క్రాక్` చిత్రాల్ని పట్టాలెక్కించారు. ఈ రెండు చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లను సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

2018-19 సీజన్ రాజాకి ఎంతమాత్రం కలిసి రాలేదు. అందుకే ఒకదాని వెంట ఒకటిగా కసిగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డిస్కో రాజా పెండింగ్ చిత్రీకరణలు సహా అన్ని పనులు పూర్తి చేసుకుని జనవరి 24న రిలీజ్ కి రానుంది. ఆ క్రమంలోనే ప్రచారం పరంగానూ వేగం పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లకు చక్కని స్పందన దక్కింది.

ఇకపై నేరుగా విజువల్ ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. 13 జనవరి 4 పీఎం టీజర్ తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈసారి రాబోయే టీజర్ ని ప్రత్యేకించి టీజర్ 2.0 అంటూ స్పెషల్ గా వేశారు. మరి అంతగా ఈ టీజర్ లో ఏం ఉంటుందో చూడాలి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రాజా స్టైల్ గా సిగార్ వెలిగించి గుప్పు గుప్పుమని పొగ వదులుతూ కనిపిస్తున్నాడు. లుక్ వైజ్ సింపుల్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వైవిధ్యమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఇందులో రవితేజ సరసన పాయల్ రాజ్పుత్- నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer