మాస్ రాజా అభిమానులకు నిరాశనే

0

మాస్ మహా రాజా రవితేజ ఛాలెంజింగ్ పెరఫార్మన్స్ తో ఫాన్స్ ని స్పెల్ బౌండ్ చేయడానికి రెడీ అవుతున్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వం లో రూపొందుతున్న తాజా సైంటిఫిక్ థ్రిల్లర్ ‘డిస్కో రాజా’ చిత్రీకరణ సహా నిర్మాణానంతర పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. దీపావళి పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమాకు రాజా ఫేవరెట్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిస్కో రాజా జనవరి 24 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుందని వెల్లడించింది. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ని డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. ఇక తాజా పోస్టర్ లో రవితేజ లుక్ మాసీగా ఆకట్టుకుంది. రాజా సూటులోనూ పిస్తోల్ పట్టుకుని మాస్ అప్పీల్ తో కనిపించాడు. పోస్టర్ లో రివైండ్ .. ఫాస్ట్ ఫార్వార్డ్.. ప్లే నాట్.. కిల్..! అంటూ ట్యాగ్ లైన్ ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రం లో రవితేజ మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తారని సమాచారం.

వాస్తవానికి డిసెంబర్ 20న విడుదల కావాల్సి ఉన్నా.. సడెన్ గా వాయిదా వేయడం మాస్ రాజా అభిమానుల్ని నిరాశపరిచింది. అయితే వాయిదా వేయడానికి కారణం ఈ సినిమాకి భారీ విజువల్ గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉండగా అది కాస్తా పెండింగులో ఉందట. డిసెంబర్ లో టీజర్ రిలీజ్ చేసి అటు పై జనవరి 24 న పర్ఫెక్ట్ థియేటర్ల లోకి దిగిపోతాడట. మాస్ మహారాజా సరసన పాయల్ రాజ్ పుత్- నభా నటేష్- తాన్యా హోప్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రామ్ తాళ్లూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer