మాస్ రాజా ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్

0

ప్రస్తుతం డిస్కో రాజాతో బిజీగా ఉన్న మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీ తమిళ్ బ్లాక్ బస్టర్ తేరి రీమేక్ అన్న సంగతి దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. అప్పుడు పవన్ ఇమేజ్ కు తగ్గట్టు చేసిన కీలక మార్పులతో స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. వాటిని రవితేజకు అనుగుణంగా మార్చే అవసరం పెద్దగా అనిపించకపోవడంతో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దీన్నే తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.

కనకదుర్గ అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలోకి వచ్చేసింది. ఓ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ మరో హీరోయిన్ గా క్యాథరిన్ త్రెస్సా ఓకే చేసినట్టు టాక్ ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులు కొంత టెన్షన్ పడుతున్నారు. దానికి కారణం కాజల్ అగర్వాల్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన వీర సారొచ్చారు రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. కనీసం యావరేజ్ కూడా కాదు

ఇప్పుడు ఈ కనకదుర్గ మూడోది అవుతుంది. అదే వాళ్ళ దిగులుకు కారణం. పోలీస్ పాత్రలు ఒకప్పటి లాగా రవితేజకు పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు. గత ఏడాది టచ్ చేసి చూడు మినిమమ్ రెస్పాన్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. పైగా తేరి కథలో పెద్దగా కొత్తదనం ఏమి ఉండదు.

అండర్ డాగ్ గా ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించే పాత్రల్లో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. పైగా అది తెలుగులో దిల్ రాజు డబ్ చేస్తే రెండు రోజులకే టపా కట్టేసింది. ఇవన్నీ రవితేజ అభిమానుల టెన్షన్ కు కారణం అవుతున్నాయి. ఒకవేళ అనూహ్యమైన మార్పులు ఏమైనా చేశారేమో విడుదలైతే కాని తెలియదు. షూటింగే మొదలుపెట్టలేదు కాబట్టి అప్పుడే ఓ అవగాహనకు రాలేం.
Please Read Disclaimer