అల్లు అర్జున్ తర్వాత మాస్ రాజా తో ఫిక్స్

0

మాస్ మహారాజా రవితేజ ఈమధ్య తన కెరీర్లో స్పీడ్ పెంచారు. వరసగా కొత్త ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారు. తాజా గా రవితేజ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. స్టార్ రైటర్ గా ఎన్నో హిట్ సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేసేందుకు మాస్ రాజా ఓకే చెప్పారని సమాచారం.

వక్కంతం వంశీ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాతో డైరెక్టర్ గా మారారు కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీ మరో కథపై పని చేస్తున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో తయారు చేసినఈ కథనే మాస్ రాజాకు వినిపించడం.. ఆయనకు నచ్చడం తో ప్రాజెక్ట్ ఒకే అయిందని సమాచారం. గతంలో రవితేజ హీరోగా నటించిన సినిమాలకు వంశీ రచయితగా పని చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని సమాచారం.

తన రెండవ ప్రయత్నం లో అయినా వక్కంతం వంశీ విజయం సాధిస్తారా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-