రవితేజ ‘ఖిలాడి’ కంటే ముందు సినిమా చూపిస్తా మామ?

0

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ సమయంలోనే రవితేజ నుండి ఖిలాడి సినిమా ప్రకటన వచ్చింది. దాంతో అంతా కూడా మాస్ మహా రాజా నుండి మరో మాస్ మూవీ రాబోతుందంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. రాక్షసుడు సినిమాతో గాడిన పడ్డ దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ సినిమాను లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కాని ఖిలాడి సినిమాకు కాస్త సమయం పట్టేలా ఉందంటున్నారు.

రవితేజ ఖిలాడి సినిమా కంటే ముందు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. రవితేజ.. త్రినాధరావు నక్కిన ల కాంబోలో మూవీ గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా దర్శకుడు త్రినాధరావు ఒక మంచి మాస్ ఎంటర్ టైనర్ కథను రెడీ చేశాడు. సినిమా చూపిస్తా మామ వంటి మాస్ మసాలా కథ అవ్వడంతో రవితేజ వెంటనే చేసేందుకు ఒప్పుకున్నాడట. క్రాక్ విడుదల కాకుండానే త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో సినిమాను ప్రారంభించబోతున్న రవితేజ అది పూర్తి కాకుండానే ఖిలాడి సినిమాను కూడా రెగ్యులర్ షూటింగ్ కు తీసుకు వెళ్లే అవకాశం ఉంది.

మొత్తానికి క్రాక్.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమా.. ఖిలాడి సినిమాలు వచ్చే ఏడాదిలోనే బ్యాక్ టు బ్యాక్ వచ్చేలా మాస్ రాజా ప్లాన్ చేస్తున్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా విషయమై అతి త్వరలో అధికారికంగా ప్రకట వచ్చే అవకాశం ఉంది అంటూ మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.