మరోసారి టాప్ గేర్ వేస్తున్న మాస్ మహారాజా!

0

మాస్ మాహారాజా రవితేజ జోరు సంగతి అందరికీ తెలిసిందే. చకచకా సినిమాలను పూర్తి చేయడం.. ఒక సినిమా పూర్తయ్యే లోపే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అంతే కాదు ఒక్కో ఏడాది లోరవితేజ నటించిన రెండు మూడు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా ఆయన స్పీడ్ తగ్గింది. మునుపటిలా సినిమాలు చేయడం లేదని మాస్ రాజా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అలాంటి ఫ్యాన్స్ అందరికీ ఇదో గుడ్ న్యూస్. రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రవితేజ మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ మీదకు తీసుకెళ్ళే సన్నాహాల్లో ఉన్నాడట. ఆ రెండు సినిమాల్లో ఒకటి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం. ఈ సినిమాకు ఠాగూర్ మధు నిర్మాత. రవి తేజ లైన్లో పెట్టిన మరో సినిమా అజయ్ భూపతి దర్శకత్వంలో జెమిని కిరణ్ నిర్మాణంలో రూపొందే చిత్రం. ఈ సినిమాలో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు.

త్వరలోనే ఈ రెండు సినిమాల లాంచ్ ఉంటుందని.. ఈ రెండు సినిమాలను అక్టోబర్లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని సమాచారం. రవితేజ తన సినిమాల విషయంలో ఇలా జోరు చూపించడం అభిమానులతో పాటుగా మాస్ ప్రేక్షకులకు ఫుల్ జోష్ ను ఇచ్చేదే. ఎందుకంటే డిఫరెంట్ కంటెంట్.. కొత్తదనం మాయలో పడి అందరూ మాస్ సినిమాలను దూరం పెడుతుండడంతో మాస్ మసాలా సినిమాలను మన ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం ఆ విషయాన్నే ప్రూవ్ చేసింది. ఎవరంటే వారు మాస్ సినిమాలు చేస్తే చూస్తారో లేదో కానీ మాస్ సినిమాలకు కేరాఫ్ ఆడ్రెస్ అయిన మాస్ మహారాజా చేస్తే ఆ కిక్కే వేరు.. ఏమంటారు?
Please Read Disclaimer