మేడం పేరు చెప్పి బాగా పబ్లిసిటీ పొందాడు

0

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘ఆవిరి’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యే వరకు పెద్దగా ఎవరికి తెలియదు. సినిమాను లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తూ చిత్రీకరించాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత రవిబాబు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. రవిబాబు గత చిత్రాల ఫలితాల కారణంగా ఆవిరి సినిమాకు మొదట జనాల్లో ఎక్కువ ఆసక్తి కనిపించలేదు. కాని ఎప్పుడైతే రవిబాబు ఒక ఇంటర్వ్యూలో కలెక్టర్ అమ్రాపాలి పేరు చెప్పాడో అప్పటి నుండి కూడా ఆవిరికి బాగా పబ్లిసిటీ దక్కింది.

‘ఆవిరి’ సినిమా పబ్లిసిటీలో భాగంగా ఒక వెబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రవిబాబు మాట్లాడుతూ తాను ‘అదుగో’ చిత్రం చేస్తున్న సమయంలో వరంగల్ జిల్లా అప్పటి కలెక్టర్ అమ్రాపాలి గారి గురించి ఒక వార్త చూశాను. ఆమె కలెక్టరేట్ లో దెయ్యం ఉందని అటు వెళ్లేందుకు భయపడుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఆవిరికి కథ రాశాను అంటూ రవిబాబు చాలా క్యాజువల్ గా చెప్పారు. ఆవిరి సినిమాకు ఆమ్రాపాలి గురించి మీడియాలో వచ్చిన ఒక వార్త కారణం అంటూ ఆయన చెప్పిన ఒక మాట సినిమాను ఒక్కసారిగా పైకి తీసుకు వెళ్లింది.

దాదాపు అన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని కవర్ చేశాయి. వెబ్ మీడియా.. సోషల్ మీడియా.. ప్రింట్ మీడియా.. ఎలక్ట్రానిక్ మీడియా అన్నింట్లో కూడా రవిబాబు ‘ఆవిరి’ మూవీకి కలెక్టర్ ఆమ్రాపాలి కారణం అంటూ కథనాలు రాయడం జరిగింది. దాంతో జనాల్లో కూడా ఆసక్తి పెరిగింది. రవిబాబు కాకతాళియంగా అన్నాడో లేదా కావాలని అన్నాడో కాని ‘ఆవిరి’ కి మాంచి ఫ్రీ పబ్లిసిటీ దక్కింది. ఇంత పబ్లిసిటీ దక్కించుకున్న ఆవిరి రేపు ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.
Please Read Disclaimer