యంగ్ డిస్కో రాజా.. అసలు గుట్టు ఇదీ

0

మాస్ మహారాజా రవితేజ యంగ్ న్యూ లుక్ గురించి ఇటీవల వైరల్ గా చర్చ సాగిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాలు సహా యూట్యూబ్ లో ఈ ఫోటో భీభత్సం సృష్టించింది. అసలు ఇది రవితేజయేనా? లేక వాళ్లబ్బాయి మహాధన్ భూపతిరాజానా? అంటూ సెటైర్లు.. జోకులు పేలాయి. యాభైకి చేరువవుతున్నా ఇంకా యంగ్ డాడ్ అయిపోతున్నాడే అంటూ సెటైర్లు వేశారు కొందరైతే. అమృతం కుండకు చిల్లు పెట్టి రాజా దోసిలి పట్టాడా? అంటూ పంచ్ లు మోతెక్కించారు.

అయితే ఆ యంగ్ లుక్ వెనక అసలు రహస్యం తాజాగా రివీలైంది. యంగ్ స్టర్ లుక్ పక్కనే .. ఒరిజినల్ ఫోటోని కలిపి ఫోటోషాప్ చేసి ప్రస్తుతం మరోసారి ఆన్ లైన్ లోకి రిలీజ్ చేశారు. ఈ ఫోటోపై ఆసక్తికర డిబేట్ కి తెరతీశారు నెటిజనం. అదంతా ఫేస్ యాప్ మహిమ. ఈ యాప్ తోనే రవితేజ ఫీచర్స్ మొత్తం ఛేంజ్ చేశారని.. దానివల్లనే రూమర్ క్రియేటైందని డిస్కో రాజా దర్శకుడు వి.ఐ.ఆనంద్ వివరణ ఇచ్చారు.

రవితేజ సెల్ఫీపై వచ్చినవన్నీ రూమర్లు మాత్రమే.. ఆ ఫోటోగ్రాఫర్ ఎవరో కూడా మా టీమ్ కి సంబంధం లేదు. ఆ ఫోటో కేవలం యాప్ సృష్టి మాత్రమే. డిస్కోరాజాలో అలాంటి సీన్ కూడా ఏదీ లేదు. త్వరలోనే డిస్కోరాజా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నాం. అప్పుడు మీకే స్పష్టంగా తెలుస్తుంది… అని చిత్రబృందం క్లారిటీనిచ్చింది. డిస్కోరాజా టైటిల్ కి తగ్గట్టే మాస్ రాజాని ఈసారి సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఓ పాత్రలో సీరియస్ గా కనిపిస్తే.. అందుకు పూర్తి భిన్నమైన వేరొక పాత్రలోనూ రవితేజ కనిపించనున్నారు. ఇదివరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. డిస్కో రాజాపై ఆడియెన్ లో బోలెడన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
Please Read Disclaimer