మాస్ మహారాజా.. క్లాసీ లుక్

0

టాలీవుడ్ లో ఎనర్జీ అనే పదానికి మారుపేరులా ఉండే హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే మాస్ ప్రేక్షకులకు పండగలా ఉంటుంది. అయితే ఈమధ్య వరస ఫ్లాపులతో ఆయన జోరు కాస్త తగ్గింది. రవితేజ తన కొత్త సినిమా ‘డిస్కోరాజా’ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఫిట్ గా.. యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు.

తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటోలో రవితేజ ఈ జెనరేషన్ హీరోలకు పోటీ అన్నట్టుగా ఫిట్ గా కనిపిస్తున్నారు. షార్ట్.. బ్లాక్ బనియన్ ధరించి 12.5 kg డంబెల్ తో ఎక్సర్ సైజ్ చేస్తూ ఫోటోకు పోజిచ్చారు. పర్ఫెక్ట్ షేప్ లో ఉన్న షోల్డర్.. బైసెప్స్ ను చూస్తుంటేనే రవితేజ తన ఫిట్నెస్ పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో తెలుస్తుంది. హెడ్ సెట్ లో సంగీతం వింటూ గాగుల్స్ ధరించి మాస్ మహారాజా ఎంతో క్లాస్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటో చూస్తుంటే రవితేజ వయసు 51 అని నమ్మడం కష్టం. అంత యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు.

రవితేజ సినిమాల విషయానికి వస్తే ‘డిస్కోరాజా’ జనవరి 24 న రిలీజ్ కానుంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైఫై యాక్షన్ ఫిలిం ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. పాయల్ రాజ్ పుత్.. నభ నటేష్.. తాన్యా హోప్.. బాబీ సింహా.. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమా మాస్ మహారాజాకు పునర్వైభవం తీసుకొస్తుందా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer