అలా డిసైడ్ అయిన మాస్ మహారాజా

0

టాలీవుడ్ లో యమా జోరుగా సినిమాలు చేసే హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఏడాదికి రెండు మూడు సినిమాలు అవలీలగా చేసే టైమ్ మ్యానేజ్ మెంట్ మాస్ రాజా సొంతం. అయితే గత కొంతకాలంగా ఫ్లాపుల కారణంగా రవితేజ స్పీడ్ తగ్గించారు. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ ఉండడంతో మాస్ రాజా సినిమా కోసం అభిమానులు చాలా సమయం వేచి చూడాల్సి వస్తోంది.

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత రవితేజ నటించే సినిమా ఇంతవరకూ విడుదల కాలేదు. ప్రస్తుతం రవితేజ రెండు సినిమాలలో నటిస్తున్నారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిస్కోరాజా’ అందులో ఒకటి. చివరిదశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘క్రాక్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్ ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే రవితేజ తన ఇతర ప్రాజెక్టుల గురించి అలోచిస్తారట.

రవితేజకు కొంతమంది నిర్మాతలు ఎడ్వాన్సులు ఇచ్చి ఉన్నారట. అయితే రవితేజ మాత్రం తొందరపడి ఏదో ఒక ప్రాజెక్టు ఫైనలైజ్ చెయ్యడం కంటే ఇప్పుడు లైన్ లో ఉన్న రెండు సినిమాల ఫలితం చూసిన తర్వాతే నెక్స్ట్ ఏం చెయ్యాలనేది ఒక నిర్ణయానికి వస్తారట. ఈలెక్కన మాస్ రాజా నుండి గతంలో లాగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఆశించడం కష్టమే. అదే కనుక ఈ రెండు సినిమాలు హిట్లయితే మాత్రం రవితేజ జోరు పెంచుతారేమో చూడాలి.
Please Read Disclaimer