ఆర్డిఎక్స్ లవ్ – టీజర్ టాక్

0

ఆరెక్స్ 100లో కామంతో రగిలిపోతూ ప్రేమించిన వాడిని మోసం చేసే ఇందూ పాత్రలో పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ కొత్త సినిమా ఆర్డిఎక్స్ లవ్ ట్రైలర్ ఇందాక విడుదలైంది. గత కొద్దిరోజులుగా విడుదలవుతున్న పోస్టర్లలో ఇందులో మంచి మసాలా కంటెంట్ ఉందని హింట్ ఇచ్చిన యూనిట్ దానికి మించే టీజర్ ని కట్ చేసి వదిలింది. కంటెంట్ కంటే బోల్డ్ నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తున్న ఆర్డిఎక్స్ లవ్ లో కథ పెద్దగా ఉన్నట్టుగా కనిపించడం లేదు.

అనగనగా ఓ ప్రేమ జంట(తేజుస్ – పాయల్ రాజ్ పుత్). పేరుకి లవ్ ఉంటారు కాని ఛాన్స్ దొరికితే చాలు కామకలాపాలలో మునిగి తేలడం వీళ్ళకు మాములు విషయం. పైగా ఇబ్బందులు లేకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. ఆఖరికి ట్రాఫిక్ పోలీస్ అడిగినా సదరు అమ్మాయే సేఫ్టీ కొనడానికి వెళ్ళాం అని చెప్పేంత రేంజ్. ఈ ప్రేమేంటో ఇంత విచ్చలవిడితనంగా ఎందుకు ఉన్నారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే

ప్యూర్ గా యూత్ ని టార్గెట్ చేసుకున్న ఆర్డిఎక్స్ లవ్ టీమ్ దానికి తగ్గట్టే ట్రీట్ మెంట్ రాసుకుంది. టేకింగ్ తో దర్శకుడు శంకర్ భాను ఎక్స్ పోజింగ్ లో పాయల్ రాజ్ పుత్ ఇద్దరూ తమ బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. పచ్చి బూతులు ప్రవోక్ చేసేలా ఉన్న భంగిమలు ఒకటా రెండా నిమిషం టీజర్ లోనే నానా రచ్చ చేశారు . ముఖ్యంగా పాయల్ మొహమాట పడకుండా ఎంత ఇవ్వాలో అంత కన్నా ఎక్కువే ఇచ్చింది. హై లైట్ అయ్యింది తన అందాలే కాబట్టి హీరోతో సహా ఇంకెవరి గురించి చెప్పాల్సిన అవసరం పడలేదు. సి కళ్యాణ్ నిర్మాణంలో రూపొందిన ఆర్డిఎక్స్ లవ్ కు రదన్ సంగీతం సమకూరుస్తుండగా రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం అందించారు
Please Read Disclaimer